పవన్ కళ్యాణ్..సినీ నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ...ప్రజల కోసం - ప్రజల తరఫున ప్రశ్నించేందుకు జనసేన పేరుతో సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ-బీజేపీలకు పవన్ మద్దతు ఇచ్చి వారి గెలుపునకు సహకరించారు. పవన్ సత్తా తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..ఆయనకు పెద్ద పీటే వేస్తుంటారు.
ప్రజల సమస్యలపై స్పందించేందుకే తానున్నానని చెప్పిన పవన్ ఆ పనిని అడపాదడపానే చేస్తూ..తన ముఖ్యమైన పని సినిమాలే అని చాటిచెప్తుంటారు. తాజాగా ప్రజా రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలని పవన్ ను ఆహ్వానిస్తే...తనకు షూటింగ్ ఉందని గుజరాత్ చెక్కేశారు. మరోవైపు శంకుస్థాపన సందర్భంగా ఏపీ ప్రజలకు తీపికబురు అందించే ఒక్క వార్తను కూడా మోడీ ప్రకటించలేదు. ప్రధానిపై గంపెడాశలు పెట్టుకున్న ఏపీ ప్రజానికి సహజంగానే ఇది బాధ కలిగించింది. దీంతో వివిధ వర్గాల వారు తమ అభిప్రాయాలను పలురకాలుగా వెల్లడిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అనే సందేహం రావడం సహజమే. ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందించే పవన్ అమరావతి శంకుస్థాపనపై ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు? ప‌్రధాని మోడీ ఏం హామీ ఇవ్వకపోవడంపై ఆయన మాటమాత్రంగా అయినా...అది కూడా తనకు నచ్చిన ట్విట్టర్ వేదికగా ఎందుకు స్పందించడంలేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రజల కోసం పవన్ తన అభిప్రాయాలను వ్యక్తీకరించాలని డిమాండ్ లు వస్తున్నాయి.