ప‌వ‌న్ నోట వైసీపీ!... మ‌ద్దతుపై డైల‌మా!

Update: 2018-01-30 06:49 GMT
టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్... నిన్న‌టితో అనంత‌పురంలో ముగించిన చ‌లోరే చ‌లోరే చ‌ల్ యాత్ర‌లో భాగంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ వైపు భ‌విష్య‌త్తు రాజ‌కీయాల‌పై త‌న‌దైన శైలిలో త‌న అమ‌య‌క‌త్వాన్ని - క‌న్ఫూజ‌న్‌ నెస్‌ ను బ‌య‌ట‌పెట్టుకుంటూనే... రోజుకో మాట మాట్లాడుతున్న ప‌వ‌న్‌... నిజంగానే జ‌నాన్ని అయోమ‌యానికి గురి చేస్తున్నార‌నే చెప్పాలి. గ‌డ‌చిన ఎన్నికల్లో టీడీపీ - బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చిన ప‌వ‌న్‌... ఏపీలో టీడీపీకి అధికారం ద‌క్క‌డంలో కీల‌క భూమిక పోషించార‌నే చెప్పాలి. ఆ త‌ర్వాత కూడా ఆయ‌న టీడీపీ వెంటే సాగుతున్నార‌ని చెప్ప‌డంలో ఏ ఒక్క‌రికి కూడా డౌట్లు లేవ‌న్న వాద‌నే వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తాన‌న్న విష‌యాన్ని ఇప్పుడే చెప్పలేన‌ని ప్ర‌క‌టిస్తున్న ప‌వ‌న్ తీరుపై ఆయ‌న అభిమానుల్లోనే కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. త‌మ అభిమాన న‌టుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్నార‌ని సంతోషించాలో - లేదంటే ప‌రిణ‌తి లేని రాజ‌కీయాలు చేస్తూ ఇత‌ర రాజకీయ పార్టీల దృష్టిలో ఆయ‌న చుల‌క‌న అవుతూనే - త‌మ‌ను కూడా చుల‌క‌న చేస్తున్నార‌ని బాధ‌ప‌డాలో తెలియ‌డం లేద‌న్న‌ది ఆ వ‌ర్గం అభిమానుల ప్ర‌శ్న‌గా వినిపిస్తోంది.

మొత్తానికి కన్ఫూజ‌న్ క్రియేట్ చేసేసి... త‌మ‌ను ప‌వ‌న్ ఎక్క‌డిదాకా తీసుకెళ‌తారోన‌న్న అనుమానాలు కూడా ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌ లో ఇప్పుడిప్పుడే బ‌ల‌ప‌డుతున్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. నిన్న‌టిదాకా త‌న యాత్ర‌లో అటు టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుతో పాటు ఇటు తాను మ‌ద్ద‌తిచ్చిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్న ప‌వ‌న్‌... నిన్న ఆశ్చ‌ర్యంగా త‌న నోట వెంటి వైసీపీ మాట‌ను కూడా వినిపించారు. వ‌చ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తాన‌ని - త‌న పార్టీ అభ్య‌ర్థులు కూడా బ‌రిలోకి దిగుతార‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌... ఆ ఎన్నిక‌ల్లో ఎవ‌రికి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌న్న విష‌యంపై ఇప్పుడే ఏమీ చెప్ప‌లేన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ - బీజేపీ పేర్ల‌ను ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌... వైసీపీ పేరును కూడా ప‌లికారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ - బీజేపీ - వైసీపీ... ఈ మూడింటిలో ఏ పార్టీకి మ‌ద్ద‌తిస్తాన‌న్న విష‌యాన్ని ఇప్పుడే చెప్ప‌లేన‌ని - ఎన్నిక‌ల నాటి ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించి మ‌ద్ద‌తు అంశంపై ఓ నిర్ణ‌యం తీసుకుంటాన‌ని కూడా ఆయ‌న చెప్పారు.

మొత్తానికి ఈ మాట చెప్ప‌డం ద్వారా యాత్ర‌లో తొలిసారిగా వైసీపీ పేరును ప‌లికిన ప‌వ‌న్‌... ఆ పార్టీకి కూడా తాను మ‌ద్ద‌తిచ్చే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న వాద‌న‌ను వినిపించారు. 2019 ఎన్నికల నాటికి తాను సూచించే ప్రజా సమస్యల పరిష్కారానికి అంగీకరించిన పార్టీకే తన మద్దతు ఉంటుందని ఆయ‌న చెప్పారు. ఇక త‌న‌దైన పాత మాట‌ను వినిపించిన ప‌వ‌న్‌... వ‌చ్చే ఎన్నికల్లో జ‌న‌సేన పార్టీ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతుంద‌ని తేల్చి చెప్పారు. ఈ విష‌యంలో ఇప్ప‌టిదాకా త‌న అభిమానుల్లో ఎవ‌రికైనా అనుమానాలుంటే.. వాటిని పార‌దోలాల‌ని కూడా ప‌వ‌న్ సూచించారు. మొత్తంగా నిన్న త‌న యాత్ర‌లో యువ‌త‌ - ప్రత్యేకించి త‌న అభిమానుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌సంగాలు చేసిన ప‌వ‌న్‌... త‌న అభిమానుల్లో కాస్తంత ఉత్సాహం నింపినా... ఏ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తాన‌న్న విష‌యం చెబుతున్న సంద‌ర్భంగా టీడీపీ - బీజేపీల‌తో పాటు వైసీపీ పేరును కూడా ప‌లికేసి... వారిని మ‌రింత‌గా డైల‌మాలో ప‌డేశార‌నే చెప్పాలి.

Tags:    

Similar News