జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం చేపట్టిన కర్నూలు పర్యటన ఆసక్తి రేకెత్తించింది. గిరిజన బాలిక సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై పోరాడేందుకే తాను కర్నూలు పర్యటనకు వస్తున్నానని చెప్పిన పవన్... కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనుకున్నట్లుగానే బుధవారం పవన్ కర్నూలులో అడుగుపెట్టగానే ఆయనకు నిరసన గళాలు స్వాగతం చెప్పాయి. అయినా లెక్కచేయని పవన్... నగరంలో ర్యాలీ నిర్వహించి - బహిరంగ సభలో మాట్లాడారు. ప్రీతికి న్యాయం చేయలేని జగన్ సీఎంగా ఉండేందుకు అర్హులేనా? అంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలాంటి నేపథ్యంలో అసలు సుగాలి ప్రీతిపై అఘాయిత్యం ఎప్పుడు జరిగింది? ఎవరు ఈ కేసును నీరుగార్చారు అన్న విషయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రీతిపై హత్యాచారానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నదే అందరి డిమాండ్. అయితే ఈ విషయాన్ని రాజకీయం చేయడానికి జరుగుతున్న తంతు నేపథ్యంలోనే ఈ కేసు వివరాలను ఓ సారి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదన వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో ఇప్పుడు ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో అసలు సుగాతి ప్రీతి ఎవరు? ఏం జరిగింది..? ఎప్పుడు జరిగింది..? ఇప్పుడెందుకు ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగిందనే విషయాలను చూస్తే.. 2017 ఆగస్టు 19న 15 ఏళ్ల బాలిక అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. కర్నూలు శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్.రాజు నాయక్ - ఎస్.పార్వతిదేవి దంపతుల 14 ఏళ్ల కుమార్తే ప్రీతి. ఓ రాజకీయ నాయకుడికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం చెబుతోంది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ యజమాని కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు.
ప్రీతి తల్లిదండ్రుల ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యులు... 2017 ఆగస్టు 20న ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్ లో బాలికపై రేప్ జరిగిందని తేల్చేశారు. పెథాలజీ హెచ్ ఓడీ డాక్టర్ సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారని తల్లిదండ్రుల వాదన. తమ దగ్గరున్న ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీసు స్టేషన్ లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యజమానితో పాటు.. అతడి కుమారులపై ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణకు ముందుగా త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్.. తర్వాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. బాలిక శరీరంపై ఉన్న గాయాలను - అక్కడి దృశ్యాల పట్ల కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. విద్యార్థినిపై లైంగిక దాడి చేసి.. హత్య చేశారని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది.
ఈ కేసులో సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిందితులను అరెస్టు చేశారు. కానీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. దీంతో తమ బిడ్డను రేప్ చేసి చంపిన వారిని శిక్షించాలంటూ బాలిక తల్లిదండ్రులు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. ఆధారాలు పక్కాగా ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై దళిత సంఘాలు కూడా ఆందోళనలు నిర్వహించాయి. అయితే ఎలాంటి న్యాయం జరగలేదు. దీంతో ఇదే విషయమై ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. దీంతో ఈ ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. పవన్ కళ్యాణ్.. బుధవారం కర్నూలు పర్యటనకు వచ్చారు. మొత్తంగా చూస్తే.. టీడీపీ అధికారంలో ఉండగా, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని తేలిపోయింది. అంతేకాకుండా టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం కూడా ఈ కేసుపై ఎంత మేర ఆందోళనలు జరిగినా... అవి బయటి ప్రపంచానికి తెలియకుండా కూడా టీడీపీ నేతలు చాలా జాగ్రత్తలు పడినట్లుగానూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా బాబు హయాంలో ప్రీతిపై హత్యాచారం జరిగితే... ఆమె కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ జమానాలో పవన్ కల్యాణ్ పోరాటం ప్రారంభించారన్న మాట.