కోవ‌ర్టుల‌తో వారికి వ‌ణుకు తెప్పిస్తున్న ప‌వ‌న్‌

Update: 2018-04-22 08:41 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ.. ఎవ‌రూ చూడ‌ని రీతిలో ఆయ‌న మీడియా మీద పోరాటం మొద‌లెట్టేశారు. కొన్ని మీడియా సంస్థ‌ల కంటే మొర‌టుగా ఆయ‌న చేస్తున్న ట్వీట్లు సంచ‌ల‌నాల మీద సంచ‌నాలుగా న‌మోద‌వుతున్నాయి. మీడియా సంస్థ‌ల‌కు చెందిన కొన్ని ఆస‌క్తిక‌ర అంశాల్ని ఆయ‌న తెర మీద‌కు తీసుకొస్తున్నారు.

ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు. మీడియా సంస్థ‌ల్లో జ‌రిగే ప‌రిణామాలు ప‌వ‌న్ కు ఎలా తెలుస్తున్నాయి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ప‌వ‌న్ వ్య‌వ‌హారంలోకి వ‌స్తే.. టీవీ9 అధినేత శ్రీ‌నిరాజు త‌న‌పై కేసు వేయ‌నున్నాడంటూ జ‌న‌సేనాధినేత ముందురోజే చెప్ప‌టం.. తాను దీర్ఘ‌కాలం పాటు న్యాయ‌పోరాటాన్ని చేయాల్సి ఉంటుంద‌న్న అంశాన్నిట్వీట్ రూపంలో ప్ర‌స్తావించ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఇలాంటి విష‌యాల‌న్నీ ప‌వ‌న్ కు ఎలా తెలుస్తున్నాయ‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. కొన్ని రాజ‌కీయ పార్టీల్లోనూ.. దాదాపు అన్ని మీడియా సంస్థ‌ల్లోనూ ప‌వ‌న్ కోవ‌ర్టులు ప‌ని చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు త‌ల‌నొప్పిగా మారిన ప‌రిస్థితి.

మీడియా..రాజ‌కీయ పార్టీల్లోని సంస్థాగ‌త అంశాల్ని గుట్టుచ‌ప్పుడు చేయ‌కుండా ప‌వ‌న్ కు వెళ్లిపోతున్నాయ‌ని.. దీంతో.. ఆయ‌న‌కు కావాల్సిన కంటెంట్ దొరుకుతోంద‌న్న మాట వినిపిస్తోంది. ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్ య‌జ‌మాని త‌న‌పై ఎంత మొత్తానికి ప‌రువున‌ష్టం దావా వేస్తార‌న్న విష‌యంపై కూడా ముంద‌స్తుగా స‌మాచారం ప‌వ‌న్ కు వెళ్లిపోయింద‌ని.. అందుకు త‌గ్గ‌ట్లే ప‌క్క‌రోజు స‌ద‌రు య‌జ‌మాని ప‌రువున‌ష్టం కేసును ప‌వ‌న్ పై న‌మోదు చేయ‌నున్న‌ట్లు ట్వీట్ తో చెప్పేసి సంచ‌ల‌నంగా సృష్టించారు.

దీనికి త‌గ్గ‌ట్లే ప‌క్క‌రోజున‌.. స‌ద‌రు ఛాన‌ల్ య‌జ‌మాని ప‌వ‌న్ పై కేసు న‌మోదు చేయ‌టం గ‌మ‌నార్హం. ఇది ఒక‌ట్రెండు మీడియా సంస్థ‌ల్లోనే కాదు.. ప‌లు రాజ‌కీయ పార్టీల్లోనూ ప‌వ‌న్ కోవ‌ర్టులు ఉన్న అంశం ఇప్పుడు అంద‌రిని ఆస‌క్తికి గురి చేస్తుంది. ప‌వ‌న్ ప్లానింగ్ ఈ తీరుగా ఉండ‌టాన్ని తాము గుర్తించ‌టంలో విప‌ల‌మైన‌ట్లుగా పార్టీలు.. కొన్ని మీడియా సంస్థ‌లు లోగుట్టుగా చెప్పుకోవ‌టం క‌నిపిస్తోంది. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు ఆయా సంస్థ‌ల్లో హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News