అలాంటివి నాకు చేత‌కాదు..మార్పు కోస‌మే

Update: 2018-01-24 14:32 GMT
త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం సంద‌ర్బంగా జ‌న‌సేన పార్టీ అధినే, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ఎజెండా గురించి స్ప‌ష్ట‌త ఇస్తున్నారు. ఖ‌మ్మం ఎంబీ గార్డెన్ లో న‌ల్గొండ -ఖ‌మ్మం  - వ‌రంగ‌ల్ జిల్లా కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మైన ఆయ‌న.. త‌న‌వి ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కాద‌న్నారు. బాధ్య‌త‌తో కూడిన రాజ‌కీయాలు చేసేందుకే పాలిటిక్స్ లోకి వ‌చ్చాన‌న్నారు. అంబేద్క‌ర్  - పెరియార్ - పూలే ఆలోచ‌న విధానంతోనే ముందుకు వెళ్తామ‌న్నారు.రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో మార్పు కోస‌మే జ‌న‌సేన పార్టీని స్థాపించాన‌న్నారు.

లెనిన్ చెప్పిన‌ట్లు ఒక్క రోజులో మార్పు రాద‌ని..మార్పు కోస‌మే కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. కుల‌ - మ‌త‌ - ప్రాంతాల క‌న్న మాన‌వ‌త్వం - జాతీయ‌త‌ను గౌర‌విస్తాన‌న్న పవన్.. మాన‌వ‌త్వంతో కూడిన రాజ‌కీయాలే జ‌న‌సేన ల‌క్ష్యమ‌ని తెలిపారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఎలాంటి దాడుల‌నైనా భ‌రిస్తాన‌ని, తిరిగి ఎదురుదాడి చేయ‌నన్నారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు కులాల‌ను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల‌ని, అది సామాజిక వాస్త‌వ‌మ‌ని అన్నారు. వాటి అర్ధం చేసుకోకుండా తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో ముందుకు వెళ్లాలేమన్నారు. రాజ‌కీయాల్లో మార్పు రావాలంటే ఉడుకు నెత్తురున్న యువ‌త కావాల‌న్నారు.

2019 ఎన్నిక‌ల్లో అద్భుతాలు చేస్తాన‌ని చెప్ప‌డం లేదని కానీ  చివ‌రి శ్వాస వ‌ర‌కు సామాజిక మార్పు కోసం యువ‌కు అండ‌గా ఉంటాన‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. చిన్న వ్యాపారం చేయాలన్నా.. చిన్న కుటుంబాన్ని న‌డ‌పాల‌న్న ఎంతో బాధ్య‌త అవ‌స‌ర‌మ‌న్నారు. అలాంటింది ఒక పార్టీని న‌డ‌పాలంటే ఎంతో బాధ్య‌త‌తో కూడిన రాజ‌కీయాలు చేయాల‌ని అన్నారు పవన్ కల్యాణ్. కొత్తగూడెం పారిశ్రామికంగా అనువైన ప్రాంతమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి శ్రీజ మళ్లీ నన్ను కలవటం సంతోషంగా ఉందన్నారు.
Tags:    

Similar News