పొలిటికల్ బజ్ లేని తెలుగు రాష్ట్రాలు
రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయం అంటే చాలా హాట్ హాట్ గా సాగుతుంది. దేశంలో పాలిటిక్స్ ఒక ఎత్తు తెలుగు నాట మరో ఎత్తు అన్నట్లుగా ఉంటుంది
రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయం అంటే చాలా హాట్ హాట్ గా సాగుతుంది. దేశంలో పాలిటిక్స్ ఒక ఎత్తు తెలుగు నాట మరో ఎత్తు అన్నట్లుగా ఉంటుంది. పొలిటికల్ టేస్ట్ ఈ ప్రాంతాలలో ఎక్కువ. కేవలం ఎన్నికల సమయంలోనే కాదు దైనందిన జీవితంలోనూ రాజకీయం పరిశీలించడం జనాలు కూడా అలవాటు చేసుకున్నారు. దానికి తగినట్లుగానే తెలుగు రాజకీయం వాడి వేడిగా సాగుతూ ఉంటుంది.
ఇక తెలుగు రాష్ట్రాలు అంటేనే పొలిటికల్ గా యాక్టివ్ గా స్ట్రాటజిక్ గా ఉండేవని పేరు కూడా తెచ్చుకున్నాయి. పొలిటికల్ గా ఒక్ బ్రాండ్ నేమ్ తో ఎంతో మంది జాతీయ స్థాయిలో సత్తా చాటుకున్నారు. ఒక ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు, కేసీఆర్ ఇలా తెలుగు నాట బలమైన ముద్రను వేసుకున్న వారు ఉన్నారు. వీరు పరిపాలించిన రాష్ట్రాలుగా కూడా పేరు ఉంది.
ఇక ఎన్టీఆర్ అంటేనే రాజకీయ బాహుబలిగా చెప్పాలి. ఆయన అప్పట్లో శ్రీమతి ఇందిరాగాంధీనే ఎదిరించిన నేతగా ఉన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ని తుడిచిపెట్టిన మహా నాయకుడిగా కూడా తిరుగులేని ఇమేజ్ ని సాధించారు.
ఇక వైఎస్సార్ అంటేనే సంక్షేమాన్ని కొత్త పధకాలతో నిర్వచించిన వారు. ఆయన ఉమ్మడి ఏపీలో అత్యంత బలమైన నాయకుడిగా కాంగ్రెస్ లో నిలిచారు. ఉమ్మడి ఏపీతో పాటు దేశంలో రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వైఎస్సార్ చేసిన కృషిని కూడా అంతా గుర్తు చేసుకుంటారు
చంద్రబాబుకు విజనరీగా దేశమంతా గుర్తింపు ఉంది. ఆయన ఓడిపోయినా కూడా గెలుపు కోసం నిరంతం పనిచేస్తూ మళ్లీ తిరుగులేని ఘనవిజయాలను అందుకునే సీనియర్ మోస్ట్ లీడర్. బాబుని అపర చాణక్యుడుగా కూడా చెబుతారు. ఆయన మార్క్ అన్నది తెలుగు రాజకీయాల్లో ఎపుడూ గట్టిగా ఉంటుంది. హైదరాబాద్ లో ఐటీని చాలా ముందుకు తీసుకుని వచ్చిన దార్శనీకుడు. ఈ రోజు హైదరాబాద్ ఐటీకి హబ్ గా ఉంది అంటే దానికి మూల కారకుడు బాబు అని అంతా ఒప్పుకునే పరిస్థితి ఉంది.
కేసీఆర్ విషయానికి వస్తే అసాధ్యం అనుకున్న తెలంగాణా రాష్ట్రాన్ని సుసాధ్యం చేసిన వారుగా చరిత్రలో కీలకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణా ఉద్యమాన్ని నడిపించిన వారుగా కనిపిస్తారు.
ఇలాంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు పొలిటికల్ గా ఎలాంటి బజ్ లేకుండా పోతోంది. దాంతో అంతా చప్పచప్పగా ఉంది. పేపర్ మీడియాలో కానీ టీవీ మాధ్యమాలలో కానీ అలాగే వెబ్ మీడియా యూ ట్యూబ్ చానల్స్ లో కానీ సరైన పొలిటికల్ కంటెంట్ లేకుడా పోయింది. అంతా సాదాసీదాగానే రాజకీయం సాగుతోంది.
ఇక సాధారణంగా చూస్తే ఒక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలలో అన్ని మీడియా చానల్స్ కి రెవిన్యూ వైజ్ గా కొంచెం బాగా వస్తుంది. ఎందుకు అంటే యాడ్స్ పరంగా బిజినెస్ బాగా జరుగుతుంది కానీ పొలిటికల్ గా బజ్ లేక సరైన కంటెంట్ లేక అనుకున్నదేదీ రీచ్ కావడం లేదని అంటున్నారు.
వీటన్నింటికీ ప్రజలే కారణం అని అంటున్నారు. ఒక పార్టీకి కానీ నాయకుడికి కానీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇస్తే కంటెంట్ అన్నది పొలిటికల్ గా అసలు ఉండదని విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఓడిపోయిన నాయకుడు కనీసం అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితి ఉంటుంది.
ఏపీలో చూస్తే జగన్ కి ప్రజలు 151 సీట్లతో 2019లో ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఇచ్చారు. ఆ రోజులల్లో చంద్రబాబు కూడా అవమానం ఫీల్ అయి అసెంబ్లీకి రెండున్నరేళ్ల పాటు రాలేదు అని అంటున్నారు. ఇపుడు జగన్ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని మారాం చేస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు.
అందుకే అసెంబ్లీ జరుగుతున్నా ఎవరూ ఆ వైపుగా చూడడం లేదు అని అంటున్నారు. దాంతో మీడియా రీచ్ లేదని అంటున్నారు. ఒకపుడు ఉమ్మడి ఏపీలో చంద్రబాబు వైఎస్సార్ అటూ ఇటూ అసెంబ్లీలో ఉంటే టీవీలకే జనాలు అతుక్కునిపోయేవారు అని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్నాళ్ళూ రాజకీయ తిరునాళ్ళు గా ఉండేదని కూడా చెబుతారు
తెలంగాణా అసెంబ్లీలో చూస్తే కేసీఆర్ సభకు రావడాం లేదు. రేవంత్ రెడ్డి దెబ్బకు ఆయన మార్క్ వ్యూహాలకు ఏ మాత్రం కేటీఆర్ సరిపోవడంలేదు అని అంటున్నారు. ఇక హరీష్ కి అంత పొలిటికల్ గా బజ్ లేదని విశ్లేషిస్తున్నారు. ఇక తెలంగాణాలో బీజేపీకి పెద్ద నాయకులు లేరు. దాంతో అక్కడ కూడా చప్పగానే అసెంబ్లీ సాగుతోంది.
ఏపీలో చూసినా ఇదే తీరు. సభలో అంతా వారే ఉన్నారు. మొత్తం నాలుగు పార్టీలు అసెంబ్లీలో కనిపిస్తున్నా మూడు పార్టీలు అధికార కూటమిలో ఉన్నాయి. దాంతో అంతా అధికార పక్షమే. అందరూ ట్రెజరీ బెంచీల వైపే ఉన్నారు స్పీకర్ కి రెండో వైపు చూసే అవకాశం వైసీపీ ఇవ్వకుండా సభకు రాకుండా పోతోంది.
దాంతో ఒంటి చేతులల్తో చప్పట్లు గానే అంతా సాగుతోంది. ప్రజాస్వామ్యంలో అధికార విపక్షాలు రెండు చక్రాలుగా ఉండాలి. అధికార పార్టీని విపక్షం నిగ్గదీయాలి. జవాబులు రాబట్టాలి. అలాగే అధికార పార్టీ కూడా తనదైన శైలిలో ప్రజలకు ఏమైనా చెప్పాలీ అంటే సరైన విపక్షం ఉన్నపుడే అది సాధ్యపడుతుంది.
ఇపుడు తెలుగు నాట రెండు సభల్లో విపక్షం నుంచి అయితే పెద్దగా పొలిటికల్ బజ్ లేకపోవడంతో అసెంబ్లీ సమావేశాలు కూడా చప్పగా సాగిపోతున్నాయని అంటున్నారు. ఇది మంచి పరిణామం కాదనే అంటున్నారు. అధికారంలో వచ్చేందుకు అవసరమైన సీట్లను ఇచ్చి బలమైన విపక్షాన్ని కూడా సభకు పంపిస్తేనే ప్రజా సమస్యలు గట్టిగా ప్రస్తావనకు వస్తాయని అంటున్నారు. మరి తెలుగు నాట ఓటర్లు చాలా తెలివైన వారు.రానున్న రోజులలో వారు ఏ రకమైన తీర్పులు ఇస్తారో చూడాల్సి ఉంది.