పవన్‌కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడటం అభిమానులకు, జనసేన మద్దతుదారులకు చాలా కాలంగా ఉన్న కల. వారు తరచుగా పవన్ రాజకీయ సమావేశాలు.. చలనచిత్ర కార్యక్రమాలలో ‘సీఎం.. సీఎం’ అంటూ పవన్ సీఎం కావాలని మద్దతుగా నినాదాలు చేస్తారు. పవన్ కూడా గతంలో కొన్ని సందర్భాల్లో తన సీఎం ఆకాంక్షల గురించి ఓపెన్ గానే మాట్లాడారు.
గత రాత్రి తిరుపతిలో తన కూటమి భాగస్వామి బీజేపీ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. లోక్ సభ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్నప్పుడు తన ప్రసంగంలో, పవన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం గురించి మాట్లాడారు.
“నేను సీఎం కావాలని కలలుకంటున్నాను. మీ హృదయాల్లో నాకు ఒక చిన్న స్థానం అవసరం. ఒకవేళ మీకు సేవ చేయడానికి నాకు అవకాశం (సీఎం పోస్ట్) లభిస్తే, మరెవరూ చేయని విధంగా నేను సేవ చేస్తాను ” అని పవన్ తన మనసులోని మాటను బయటపెట్టారు.
ఇప్పటికే 2024 సార్వత్రిక ఎన్నికలలో పవన్‌ను బిజెపి-జనసేన కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఇదే విషయంపై తిరుపతి సభలో అభిమానులు నినాదాలు చేయడంతో ‘సీఎం’ నినాదంపై పవన్ హాట్ కామెంట్స్ చేశారు.