హోదాపై ప‌వ‌న్ ప‌వ‌ర్ ఫుల్ పంచ్ ఇదే!

Update: 2017-12-19 07:49 GMT
జ‌న‌సేన అధినేత‌ - టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఏపీకి ప్ర‌త్యేక హోదాపై మ‌రోమారు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాష్ట్రానికి ఎలాంటి మేలు జ‌రుగుతుంద‌న్న విషయంపై చాలానే మాట్లాడేసిన ప‌వ‌న్‌... విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ప్ర‌త్యేక హోదా ఏపీ ప్ర‌జ‌ల హ‌క్కుగా అభివ‌ర్ణించిన విష‌యం తెలిసిందే. దీనిని సాధించే దిశ‌గా ఏపీ ఎంపీలు కించిత్ శ్ర‌ద్ధ కూడా పెట్ట‌డం లేద‌ని కూడా ఆయ‌న త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు. ఏపీ ఎంపీలు... ప్ర‌త్యేకించి అధికార పార్టీ టీడీపీ ఎంపీల‌ను ద‌ద్ద‌మ్మ‌లుగా అభివ‌ర్ణించిన ప‌వ‌న్‌... ప్ర‌త్యేక హోదా బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీని ప్ర‌క‌టించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని సైతం... పాచిపోయిన ల‌డ్డూలిచ్చార‌ని దునుమాడేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం సాగిస్తున్న ఉద్య‌మంలో ప‌వ‌న్ ఏ ఒక్క‌రినీ వ‌దిలేందుకు సిద్దంగా లేర‌న్న విష‌యం కాకినాడ‌లో ఆయ‌న నిర్వ‌హించిన స‌భ‌తోనే తేలిపోయింది. ఈ క్ర‌మంలో కాకినాడ స‌భ త‌ర్వాత పవ‌న్ నిర్వ‌హించిన ప్ర‌తి స‌భ‌లోనూ ప్ర‌త్యేక హోదా ఆవ‌శ్య‌కత‌, ఏపీకి లాభించే విష‌యాలు, హోదాను సాధించే విష‌యంలో ఆయా పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, ఏపీ ఎంపీల పాత్ర‌, అధికార పార్టీ వ్యూహం త‌దిత‌రాల‌న్నింటినీ కూడా ప‌వ‌న్ ఇప్ప‌టికే ప్ర‌స్తావించేశారు కూడా.

తాజాగా నేటి ఉద‌యం కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌వ‌న్ చేసిన వ‌రుస ట్వీట్లు పెను సంచ‌ల‌నం రేపుతున్నాయి. త‌మిళ‌నాడులోని సేలం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించేందుకు కేంద్రం చేప‌డుతున్న చ‌ర్య‌ల‌ను నిలువ‌రించేందుకు రంగంలోకి దిగిన ఆ రాష్ట్ర సీఎం ఎడ‌ప్పాడి ప‌ళ‌నిసామి చ‌ర్య‌ల‌ను ఊటంకిస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. ఇటీవ‌లే ప‌వ‌న్ క‌ల్యాణ్ శ్రీ‌కాకుళం జిల్లాలోని డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(డీసీఐ)లో చోటుచేసుకున్న తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఆ యూనిట్‌ను సంద‌ర్శించారు. అక్క‌డ ఉద్యోగుల‌కు త‌న మ‌ద్ద‌తు ప్ర‌కటించిన ప‌వ‌న్‌.. డీసీఐ కూడా ప్రైవేటు ప‌రం కాకుండా కాపాడుకునేందుకు అంతా న‌డుం బిగించాల‌ని కూడా ఆయ‌న పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. అస‌లు త‌న నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా డీసీఐ సంద‌ర్శ‌న‌తోనే త‌న ప‌ర్య‌ట‌న‌ను ప్రారంభించిన ప‌వ‌న్‌... దాని ప్రాధాన్యాన్ని చెప్ప‌క‌నే చెప్పారన్న వాద‌న వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన ప‌ళ‌నిసామి అంశాన్ని ప్ర‌స్తావిస్తూ.. నేటి ఉద‌యం ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో నెల‌కొన్న అయోమ‌య ప‌రిస్థితుల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా ఎడ‌ప్పాడి సేలం స్టీల్ ప్లాంట్ ర‌క్ష‌ణ కోసం న‌డుం బిగించిన వైనాన్ని ప‌వ‌న్ కీర్తించారు. త‌మిళ‌నాడు రాజ‌కీయ వేత్త‌లు... త‌మ రాష్ట్రం కోసం, త‌మ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం ఎంత‌గా శ్ర‌మిస్తున్నారో ఎడ‌ప్పాడి చ‌ర్య‌లే నిద‌ర్శ‌న‌మ‌ని కూడా ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను ఆపాలంటూ ప‌ళ‌నిసామి... ప్ర‌ధానికి విన‌తి ప్ర‌తాన్ని స‌మ‌ర్పించిన సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ను ప‌వ‌న్ షేర్ చేయ‌డంతో పాటుగా... త‌మిళ ప్ర‌జ‌ల కోసం ఆ రాష్ట్ర పాల‌కులు ఎంత దూరం వెళ్లేందుకైనా సిద్ధ‌ప‌డుతున్న తీరు త‌న‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ప‌ళ‌నిసామి మాదిరిగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న డీసీఐని కాపాడుకునేందుకు రంగంలోకి దిగే విష‌యంలో ఏపీ ఎంపీలు, ఏపీ స‌ర్కారుకు ఏమైంద‌ని కూడా ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం డీసీఐని ప్రైవేటీక‌రించే దిశ‌గా కేంద్రం వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంద‌ని, ఏపీ నేత‌లు మేల్కోక‌పోతే చాలా న‌ష్ట‌మే జ‌రిగిపోతుంద‌ని ప‌వ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. డీసీఐ న‌ష్టాల్లో ఉంద‌ని కేంద్రం చెబుతోందని, అయితే ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదాను ప్ర‌క‌టిస్తే... డీసీఐ మ‌ళ్లీ లాభాల బాట‌లోకి రాదా? అంటూ కూడా ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. ఈ విష‌యం ఏపీ ఎంపీల‌కు ఎందుకు గుర్తుకు రావ‌డం లేద‌ని, అస‌లు ఈ విష‌యం వారికి ఎందుకు అర్ధం కావ‌డం లేద‌న్న కోణంలో ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

అస‌లు ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఏపీ ఎంపీలు ఎందుకు గ‌ళం విప్ప‌డం లేద‌ని కూడా అర్థం వ‌చ్చేలా ప‌వ‌న్ కామెంట్లు చేశారు. ఏపీ ఎంపీల గొంతు పెగ‌ల‌కుండా చేస్తున్న కార‌ణాల‌ను కూడా ప‌వ‌న్ క్లిస్ట‌ర్ క్లియ‌ర్‌గానే బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. వ్య‌క్తిగ‌త‌, పార్టీల‌కు ప్ర‌యోజ‌నాలు చేకూర్చే అంశాల‌ను ఆధారం చేసుకున్న కార‌ణంగానే ఏపీ ఎంపీల గ‌ళం మూగ‌బోయింద‌ని ప‌వ‌న్ ఆరోపించారు. ఈ త‌ర‌హా రాజ‌కీయాలు చేస్తే.. యువ‌, భ‌విష్య‌త్తు త‌రాలు కుల‌, మ‌త‌, వ‌ర్గ, ప్రాంత బేధాలు లేకుండా తీవ్రంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని ప‌వ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అంత‌టితో ఆగ‌ని ప‌వ‌న్ఈ... త‌ర‌హా రాజ‌కీయాల‌కు చ‌ర‌మ గీతం పాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని కూడా టీడీపీ ఎంపీల‌కు ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఈ దిశ‌గా తాను చాలా క్లియ‌ర్‌గానే ముందుకు సాగుతున్నాన‌ని, జ‌వాబుదారీ రాజ‌కీయాల‌ను తిరిగి తాను తీసుకొస్తాన‌ని కూడా ప‌వ‌న్... ప‌వ‌ర్ ఫుల్ పంచ్ వేశారు. మొత్తంగా తమిళనాడు సీఎం చేసిన ఓ చిన్న విన‌తిని ఆధారం చేసుకున్న ప‌వ‌న్‌... ఏపీలోని అధికార పార్టీ టీడీపీ - ఆ పార్టీ ఎంపీల‌తో పాటు ఏపీకి చెందిన ఇత‌ర పార్టీల ఎంపీలను క‌డిగిపారేశార‌నే చెప్పాలి. మ‌రి ప‌వ‌న్ ట్వీట్ల‌పై ఆయా పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Tags:    

Similar News