జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వంపై 'స్నాప్‌షాట్' రూపంలో చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఏపీ ప్రభుత్వ వైఫల్యలు, ఆరోపణలపై ఈ ట్వీట్ లో పవన్ తీవ్రంగా విమర్శించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ 'స్నాప్‌షాట్' రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలను టచ్ చేసింది. 'ఆంధ్రప్రదేశ్‌ని వైసీపీ నుండి సేవ్ చేయండి.' అని పవన్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పవన్ తన ట్వీట్ లో ఏపీలో జరుగుతున్న ఆర్థిక దుర్వినియోగం.. రాష్ట్రాన్ని 'అప్పుల ప్రదేశ్' గా మార్చినందుకు సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. మరొక వెనిజులాగా మారే దశలో ఉందని ట్వీట్ లో విమర్శించారు. మరుగుదొడ్లు, చెత్త సేకరణపై పన్ను విధించే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉందంటూ స్నాప్ చాట్ లో ప్రస్తావించారు.
అయితే ప్రధాన హైలైట్ ఏమిటంటే, పవన్ సినిమా టికెట్ల అమ్మకం గురించి ప్రస్తావించారు. తను హీరోగా నటించిన 'వకీల్ సాబ్' సినిమా విడుదల సమయంలో జగన్ ప్రభుత్వం టికెట్ ధరలో ఇబ్బందులను సృష్టించింది. దీంతో ఇప్పుడు దానిపై ప్రతీకార రాజకీయం పవన్ మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది.
సినిమా టిక్కెట్ ధరల వివాదం గురించి పవన్ మొదటిసారి బహిరంగంగా ఈరోజు ట్వీట్ లో విమర్శించాడు. ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్ కోసం ప్రభుత్వం ఒక వెబ్ పోర్టల్‌ను ప్రారంభించడానికి తాను వ్యతిరేకం అని పరోక్షంగా చెప్పాడు.
'సేవ్ స్టీల్ ప్లాంట్' 'మటన్ షాప్స్' 'జిఓలపై సెన్సార్‌షిప్' మరికొన్ని ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను ఈ స్నాప్‌షాట్‌లో కూడా పవన్ ప్రస్తావించి విమర్శించారు.