పవర్ స్టార్ గా ఆయనకు తెలుగు ప్రజల్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పవన్ మూవీ వస్తుందంటే చాలు.. యూత్ ఎలా ఊగిపోతుందో చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూవీ స్టార్ గా పవన్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెర మీద స్టైలీష్ లుక్ తో.. ట్రెండీగా కనిపించే పవన్.. తెర వెనుక మాత్రం అందుకు భిన్నంగా.. చాలా సింఫుల్ గా ఉంటారు.
గడ్డం గీయించుకోకుండా ఉండటం.. పంచె కట్టుతో డిఫరెంట్ గా కనిపిస్తారు. ఎందుకలా? అన్న ప్రశ్న చాలామందిని తొలిచేస్తూ ఉంటుంది. తాజాగా ఆ విషయాల మీద క్లారిటీ ఇచ్చారు పవన్. షూటింగ్ లేని సమయంలో గడ్డం గీసుకునే అలవాటు తనకు మొదట్నించి తక్కువేనని చెప్పారు. ఇక.. పంచె కట్టు అన్నది మన సంస్కృతిని గౌరవిస్తూ తాను కట్టుకుంటానని చెప్పారు.
ఇవాల్టి రోజున తెలుగు ప్రముఖులు ఎవరూ పంచె కట్టుకోవటం కనిపించదు. వయసులో పెద్దోడైన చంద్రబాబు కావొచ్చు.. ఆయన శిష్యుడు కమ్ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సైతం పంచె కట్టులో కనిపించరు. కల్చర్ గురించి.. పరంపర గురించి అదే పనిగా మాట్లాడే కేసీఆర్ సైతం ఢిల్లీ విమానం ఎక్కితే చాలు..తన వస్త్రధారణను మార్చేస్తుంటారు. కానీ.. అందుకు భిన్నంగా గ్లామర్ ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ.. సంస్కృతి సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా పంచె కట్టుకోవటం పవన్ కే చెల్లుతుందేమో?
చిన్నతనం నుంచి తాను రకరకాల పరిస్థితుల నుంచి పెరిగానని.. దిగువ మధ్యతరగతిని చూశానని.. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. తన అన్నయ్య సినిమా యాక్టర్ కావటంతో తానూ నటించినట్లు చెప్పారు. పేదరికాన్ని చూసిన పవన్ డబ్బుల్ని చూశానని చెప్పారు. హిట్లు.. ప్లాపులు వచ్చాయని.. పార్టీ పెట్టామని.. దెబ్బ తిన్న విషయాన్ని అంగీకరించారు.
పార్టీ పెట్టటం ద్వారా తమకు 21 శాతం ఓటు బ్యాంకు ఉన్నట్లు తేలిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. సభలకు 100 మంది వస్తే అందులో 20 మంది నమ్మారు కదా? అని ప్రశ్నించే పవన్.. జనసేనకు ఒక శాతం ఓటుబ్యాంకు ఉందన్న కేసీఆర్ మాటకు రియాక్ట్ అయ్యారు. జనసేనకు ఒక్క శాతం ఓటు బ్యాంకు ఉందన్న విషయాన్ని అయినా కేసీఆర్ ఒప్పుకున్నారు కదా.. ప్రయాణం అన్నది ఒక్క అడుగుతోనే మొదలవుతుందంటూ శాంతంగా.. సెటిల్డ్ గా చెప్పటం గమనార్హం. తన మీద పంచ్ వేసినోడికి అంతకు రెట్టింపు పంచ్ లు వేసే ధోరణికి భిన్నంగా పవన్ తాజా మాటలు ఉండటం విశేషం.