జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇంతకాలం హైదరాబాద్ లో ఉంటూ రాజకీయాల్ని నడిపిన ఆయన.. తాజాగా విజయవాడలో అద్దె ఇంటిని తీసుకొని అందులోకి దిగిపోయారు. విజయవాడలోని పడమటలో ఇంటిని అద్దెకు తీసుకున్న ఆయన.. శుక్రవారం ఉదయం గృహప్రవేశం చేశారు.
ఈ సందర్భంగా గృహప్రవేశ కార్యక్రమాన్ని సతీసమేతంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అద్దె ఇంటిని తీసుకున్న నేపథ్యంలో విజయవాడ కేంద్రంగానే పార్టీ కార్యక్రమాలు సాగుతాయని చెబుతున్నారు. ఈ మధ్యన విజయవాడ- గుంటూరు మధ్యలో నాగార్జున విశ్వవిద్యాలయానికి దగ్గర్లోని కాజ గ్రామంలో సొంతిల్లు.. పార్టీ ఆఫీస్ కోసం స్థలాన్ని తీసుకొని భూమిపూజ నిర్వహించారు.
ఇంటిని త్వరగా పూర్తి చేసి అందులో దిగాలని భావించారు. అయితే.. ఇంటి నిర్మాణం జాప్యం అవుతుండటంతో అద్దె ఇంటిని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా తీసుకున్న అద్దె ఇంట్లో పార్టీ సమావేశాలు.. మీడియా సమావేశాలు నిర్వహించుకోవటానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. అద్దె ఇల్లు కేంద్రంగానే జనసేన పార్టీ కార్యకలాపాల్ని పవన్ నిర్వహిస్తారని చెబుతున్నారు.