జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విద్యార్థుల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. ఏపీలో త్వరలో నిర్వహించనున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. గ్రూప్ 2 పరీక్షకు సిద్ధం అయ్యేందుకు తగు సమయం లేదని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వాయిదా వేయకపోవడం వల్ల తమ భవిష్యత్ దెబ్బతింటుందని వాపోయారు. ఈ క్రమంలో వారు జనసేన అధినేతను కలిశారు. దీంతో పవన్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిపై ప్రభుత్వం, ఎపీపీఎస్ సీ అధికారులు సానుభూతితో స్పందించాల్సి ఉంటుదని తన లేఖలో పవన్ కోరారు. ప్రిలిమ్స్ పరీక్షకు-మెయిన్స్ పరీక్షలకు మధ్య ఉన్న 45 రోజుల గడువు సరిపోయే పరిస్థితి లేదని తెలిపారు. కనీస సమయం కూడా లేకుండా మెయిన్స్ పరీక్షలు నిర్వహించడం వల్ల చాలా మంది నష్టపోతారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని పవన్ పేర్కొన్నారు. అభ్యర్థుల్లో కన్పిస్తున్న మానసిక ఆందోళనను సహృదయంతో అర్థం చేసుకుని పరీక్షలు వాయిదా వేయాలని పవన్ కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/