మోడీకి పవన్ సుద్దులు

Update: 2016-11-20 11:09 GMT
దేశమంతా హాట్ టాపిగ్గా మారిన ఇష్యూపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరిగ్గా స్పందించారు. అది కూడా ట్విట్టర్లో నరేంద్ర మోడీకి నాలుగు మంచి మాటలు చెప్పి మమ అనిపించారు. బ్యాంకులు - ఏటీఎంల ముందు జనం సేనల్లా బారులు తీరుతుంటే జనసేనాధిపతి మాత్రం వారి గురించి ట్విట్టర్లో బాధపడిపోయారు.

అయితే... ఈ విషయంలో పవన్ కేంద్ర ప్రభుత్వాన్ని కీలక డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి కొత్త కరెన్సీ ఎంతమేర అందుబాటులో ఉందో ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఆయన కోరారు. రహస్యంగా ఉంచాలనే భావనతో ఈ విషయాన్ని దాచడం మంచిది కాదని... డబ్బు అందుబాటులో ఉంటే... ఆ విషయం ప్రకటించాలని.. అప్పుడు ప్రజల్లో ఆందోళన తగ్గుతుందని ఆయన అన్నారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ - అసంఘటిత పట్టణ మార్కెట్ల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా, డబ్బు తీసుకోవడానికి క్యూ లైన్లలో ఉండే వయోవృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నోట్ల రద్దుతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని... ప్రజల్లో ఉన్న అశాంతిని తొలగించడానికి ప్రభుత్వం సరైన చర్యలను వెంటనే తీసుకోవాలి సూచించారు. రద్దు చేయడానికి ముందే కేంద్ర ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదని ఈ సందర్భంగా పవన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గమనిస్తుంటే... నోట్లను రద్దు చేయడానికి ముందు ఎలాంటి ఎక్సర్ సైజ్ చేయలేదనే విషయం అర్థమవుతోందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News