రంగు మార్చిన జనసేనాని.. కారణం ఇదేనట..

Update: 2018-05-24 08:32 GMT
ఉత్తరాంధ్రలో జనసేనాని పవన్ కళ్యాన్ నిర్వహిస్తున్న యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. యువత పెద్ద ఎత్తున పవన్ సభలకు హాజరవుతున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ అక్కడి స్థానిక సమస్యలను లేవనెత్తుతూ అధికారపార్టీని ఇరుకునపెడుతున్నారు. తాజాగా  పవన్ కల్యాన్ తెల్లటి వస్త్రాలు కాకుండా  గ్రీన్ డ్రెస్ వేసుకొని ర్యాలీలో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ నేపథ్యంలో పవన్ వేసుకున్న గ్రీన్ డ్రెస్ పై సోషల్ మీడియాతోపాటు స్థానిక మీడియాలో కూడా పలు రకాల వార్తలు వచ్చాయి.. పవన్ కళ్యాణ్ జోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతారని.. ఓ సిద్ధాంతి చెప్పారనే ముదురు ఆకుపచ్చ రంగు దస్తులు ధరించారని వార్తలు వచ్చాయి..  పవన్ కళ్యాన్ జ్యోతిష్యుడి మాటలను నమ్మే యాత్రలో ఇలా డిఫెరెంట్ దుస్తులను ధరిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ విషయం ఆనాట ఈనోట  జనసేన టీంకు.. వారి నుంచి  పవన్ కళ్యాన్ వరకూ చేరింది. దీంతో తాజాగా తన గ్రీన్ డ్రెస్ గురించి పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చాడు..

పవన్ కళ్యాన్ మాట్లాడుతూ.. ‘శ్రీకాకుళం జిల్లా నుంచి చాలామంది భారతసైన్యంలో చేరారని.. ఈ దేశంలోనే భారత మాత దేవాలయంగా శ్రీకాకుళం నిలిచిందని.. అందుకే సేవ చేస్తున్న శ్రీకాకుళం సైనికులకు భరోసానిచ్చేందుకే తాను వారు వేసుకునే దుస్తులు ధరించానని’ వివరణ ఇచ్చారు. దీంతో తనకు జ్యోతిష్యం మీద.. జ్యోతిష్యుల మీద నమ్మకాలు లేవని.. ఈ ప్రకటనతో వివరణ ఇచ్చారు.


Tags:    

Similar News