ప‌వ‌న్ పోరాట‌యాత్ర వెనుక ఉద్దేశం అద‌ట‌!

Update: 2018-05-20 08:59 GMT
ఏదైనా చేయాల‌ని అనుకుంటే దాని గురించి వెనుకా ముందు అన్న‌ది ఆలోచించ‌కుండా దూసుకెళ్లాలి. కానీ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌వ‌హారం కాస్తంత వేరు. ఆయ‌న చేసే ప్ర‌తి విష‌యంపైనా ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెన‌క్కి అన్న‌ట్లుగా ఉంటుంది. కొద్ది నెల‌ల క్రితం అనంత‌పురంలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ఆ జిల్లాలో క‌ర‌వు గురించి తెలుసుకునేందుకు తాను పాద‌యాత్ర చేయాల‌నుకుంటున్న‌ట్లు చెప్పిన ప‌వ‌న్.. ఆ త‌ర్వాత దాని గురించి మాట్లాడింది లేదు.

అంతేనా.. హోదా మొద‌లు అక్వా మెగాపార్క్ .. ఉద్దానం ఇష్యూ వ‌ర‌కూ ప‌లు స‌మ‌స్య‌ల మీద తాను పోరాటం చేస్తాన‌ని.. అవ‌స‌ర‌మైతే ఎంత‌వ‌ర‌కూ వెళ్ల‌టానికైనా సిద్ధ‌మ‌ని చెప్పిన ప‌వ‌న్‌.. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క ఇష్యూ మీదా పూర్తిస్థాయిలో మాట్లాడింది.. పోరాడింది లేదు. ఇలాంటి వేళ‌.. 45 రోజుల పాటు నాన్ స్టాప్ గా తాను ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో యాత్ర చేస్తున్న‌ట్లు చెప్పారు. అలా అని అది పాద‌యాత్ర కాద‌ని.. అదే స‌మ‌యంలో బ‌స్సుయాత్ర కూడా కాద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

ఇంత‌కీ ప‌వ‌న్ చేసేది ఏమిటంటే.. పోరాట‌యాత్ర అని చెప్ప‌టం క‌నిపిస్తుంది. పాద‌యాత్ర‌..బ‌స్సుయాత్ర కాకుండా ఈ పోరాట‌యాత్ర ఏమిటి?  దాని వెనుక క‌త ఏమిట‌ని చూస్తే.. వివ‌రాలు మ‌రింత ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. అదేమంటే.. తాను ప‌ర్య‌టించే ప్రాంతాల్లో బ‌స్సులో వెళ‌తార‌ని.. అక్క‌డ స్థానికంగా ఉండే స‌మ‌స్య‌ల మీద దృష్టి సారిస్తార‌ని. అలాంటి స‌మ‌యాల్లో కొంత‌మేర న‌డుస్తార‌ని.. అక్క‌డ‌క్క‌డ రోడ్ షోలు నిర్వ‌హిస్తార‌ని చెబుతున్నారు.

అంటే.. ఎప్పుడు ఎక్క‌డేం చేస్తార‌న్న‌ది ఆ పార్టీ వ్యూహ‌క‌ర్త‌ల‌కు త‌ప్పించి మ‌రెవ‌రికీ తెలీద‌న్న‌ట్లే. అందుకే.. ప‌వ‌న్ చేసే యాత్ర‌ను పోరాట‌యాత్ర‌గా చెబుతున్నారు.

ఈ రోజు ఉద‌యం శ్రీ‌కాకుళం జిల్లా క‌విటి మండ‌లం క‌ప‌న కుర్ది వ‌ద్ద ఉన్న స‌ముద్ర‌తీరంలో గంగ‌పూజ‌లు చేసిన వ‌ప‌న్‌.. అక్క‌డ నుంచి త‌న పోరాట‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. అక్క‌డ నుంచి బ‌హిరంగ స‌భ‌నునిర్వ‌హించే ప్రాంతానికి చేరుకోవ‌టానికి దాదాపు మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల వేళ‌కు చేరుకుంటార‌ని చెబుతున్నారు. స్థానికంగా ఉన్న సూరంగి రాజావారి మైదానంలో స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు.  

పోరాట యాత్ర‌కు సంబంధించిన వివ‌రాలు చూస్తే..

+ పోరాట యాత్ర తొలిద‌శ 45 రోజుల పాటు సాగుతుంది.

+  ఈ ద‌శ‌లో మూడు ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో యాత్ర సాగుతుంది.

+ కాసిన్ని ప్ర‌సంగాలు.. మ‌రికాసిని స‌మ‌స్య‌ల గురించి తెలుసుకోవ‌టం చేస్తారు

+ కొన్నిచోట్ల బ‌స్సుల్లో.. మ‌రికొన్నిచోట్ల పాద‌యాత్ర‌.. ఇంకొన్ని చోట్ల ర్యాలీలు చేప‌డ‌తారు.

+ తాజా యాత్ర‌తో ఉత్త‌రాంధ్ర‌లోని స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాల‌న్న‌ది ప‌వ‌న్ ఆలోచ‌న‌

+  పోరాట యాత్ర‌ల‌తో స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న పెంచుకొని త‌దుప‌రి రూపొందించే పార్టీ మేనిఫెస్టోకు కీల‌కం కానుంది

+ త‌న దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌లపై ప‌రిష్కార మార్గాల్ని మేనిఫేస్టోలో వెల్ల‌డిస్తారు

+ పోరాట యాత్ర‌లో ప్ర‌త్యేక హోదా.. రైల్వేజోన్ అంశాల్ని ప్ర‌త్య‌కంగా ప్ర‌స్తావిస్తారు.

+ ఈ అంశాల‌పై అక్క‌డ‌క్క‌డ క‌వాతులు.. ర్యాలీలు నిర్వ‌హించే వీలుంది

+ ఉత్త‌రాంధ్ర జిల్లాలో నెల‌కొన్న వెనుక‌బాటు గురించి త‌న ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌త్యేకంగా ప‌వ‌న్ ప్ర‌స్తావిస్తారు

+ త‌న యాత్ర సంద‌ర్భంగా స్థానికంగా ఉండే క‌ల్యాణ మండ‌పాల్లో ప‌వ‌న్ బ‌స చేస్తారు

+ ఒక‌వేళ క‌ల్యాణ మండ‌పాలు లేకుంటే క‌మ్యూనిటీ హాళ్ల‌ల్లో బ‌స చేస్తారు.

+ యాత్ర సంద‌ర్భంగా పార్టీలోకి నాయ‌కుల్ని ఆహ్వానించ‌నున్నారు.

+ ప‌వ‌న్ యాత్ర కోసం త‌యారు చేస్తున్న ప్ర‌త్యేక బ‌స్సు శ్రీ‌కాకుళం చేరుకోవ‌టానికి కాసింత టైం ప‌డుతుంద‌ట‌
Tags:    

Similar News