పవన్ ఫామ్ హౌస్ లో ఏం జరిగింది?

Update: 2016-09-04 05:25 GMT
మరో ఐదు రోజుల తర్వాత జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బహిరంగ సభ కాకినాడలో జరగనుంది. తిరుపతి సభ తర్వాత 13వ రోజు నిర్వహిస్తున్న సభకు పవన్ ఎలాంటి కసరత్తు చేస్తున్నారు? బర్త్ డేలు జరుపుకోవటం అలవాటు లేని పవన్ కల్యాణ్.. బర్త్ డే బాయ్ గా ఏం చేశారు? అన్న ప్రశ్న వేసుకుంటే ఆసక్తికర సమాధానం లభిస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి బర్త్ డే రోజున ఫామ్ హౌస్ లో పవన్ కల్యాణ్ ఫుల్ బిజీ ఉన్నారు. కాకినాడ మీటింగ్ కోసం ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన వారితో సంప్రదింపులు జరపటంతో పాటు.. రివ్యూ సమావేశాన్ని నిర్వహించటం గమనార్హం.

తిరుపతి సభ కంటే మరింత ప్రభావం చూపించేలా.. తనకున్న బలాన్ని ప్రదర్శించేలా కాకినాడ సభను నిర్వహించాలని భావిస్తున్నారు. తిరుపతి సభలోజనం పోటెత్తినా.. కేవలం రోజు కంటే తక్కువ వ్యవధిలో జరిగిన ఏర్పాట్లలో లో పాలు స్పష్టంగా కనిపించాయి. అలాంటివేమీ లేకుండా చూడాలని పవన్ భావిస్తున్నారు. కాకినాడ సభకు కనీసం మూడు.. నాలుగు లక్షల మంది తరలి వచ్చేలా సభ భారీ సక్సెస్ అవుతుందన్నభావన వ్యక్తమవుతోంది.

తిరుపతి సభతో పోలిస్తే.. కాకినాడ సభలో పంచ్ లు మరిన్ని పడనున్నట్లుగా తెలుస్తోంది. తిరుపతి సభ అనంతరం తనపై మండిపడిన వారి క్లిప్పింగ్ లను సునిశితంగా పరిశీలించిన పవన్ కల్యాణ్.. వాటన్నింటికి కౌంటర్లు తప్పవని చెబుతున్నారు. ఇక.. కాంగ్రెస్.. బీజేపీల మీద ఈసారి మరింత ఆగ్రహం వ్యక్తం చేయొచ్చని.. మోడీ సర్కారు మీద నిప్పులు చెరిగే పరిస్థితి ఉండొచ్చన్నది అంచనా.

ప్రత్యేక హోదా మీద గళం విప్పిన ఆయన.. తాజాగా హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ మీద దృష్టి పెట్టిన కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడటం ఖాయమంటున్నారు. కాకినాడ సభలో పార్టీ నిర్మాణానికి సంబంధించిన ప్రకటనను కూడా పవన్ చేయొచ్చని తెలుస్తోంది. తన తదుపరి సభను ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తున్న విషయాన్ని ప్రకటించటంతో పాటు.. జనసేన నిర్మాణంపై పవన్ మాట్లాడే అవకాశం ఉంది. తన దశల వారీ ఆందోళనలో భాగంగా ఢిల్లీలో తాను చేపట్టే నిరసన గురించి కూడా వెల్లడించే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా.. హోదా మీద ఎన్డీయే సర్కారుకు తలంటు కార్యక్రమం కాకినాడ సభలో పెద్ద మొత్తంలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News