నాలుగేళ్లకు పైనే బాబులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కనిపించిన రాజకీయ అనుభవం గడిచిన కొద్ది నెలలుగా కనిపించకపోవటం తెలిసిందే. అబద్ధాలతో కాలం గడిపే చంద్రబాబును భుజాన వేసుకొని మోసిన పవన్.. ఈ రోజున ఆయన్ను ఉద్దేశించి విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు.
ఇవాల్టికి ఇవాల్టికి చంద్రబాబేమీ కొత్తగా మాట్లాడటం లేదు. కాకుంటే.. ఆయన నోటి నుంచి వచ్చే పాత మాటల్ని జనసేనాధినేత పచ్చ కళ్లజోడు తీసి చూడటంతో ఆయనకు ఆరాచకమంతా కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. సింగపూర్ లాంటి సిటీని నిర్మిస్తానని నిత్యం సింగపూర్ జపం చేసే చంద్రబాబుకు.. అదే పేరుతో పంచ్ లు వేశారు పవన్ కల్యాణ్. బాబు పాలనలోని లోపాల్ని ఎత్తి చూపుతున్న ఆయన.. బాబు సర్కారుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సింగపూర్ లాంటి నగరాన్ని నిర్మిస్తానని చెప్పే చంద్రబాబు.. ఆ దేశం తరహాలో నిర్మాణాలు చేపడతానని చెబుతారు కానీ.. ఆ దేశంలో మాదిరి చట్టాల్ని అమలు చేస్తానన్న మాటను ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. అవినీతితో పాటు.. ఏ చిన్న తప్పునకైనా దారుణ శిక్షలు విధించే సింగపూర్ చట్టాలు మహా కఠినంగాఉంటాయి.
సింగపూర్ లాంటి పాలనే అయితే కనుక విధి నిర్వహణ ఉన్న మహిళా అధికారిపై దాడి చేసిన ఎమ్మెల్యేలు జైల్లో ఉండేవారని విరుచుకుపడ్డారు. ఎమ్మార్వో వనజాక్షిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే చేయి చేసుకోవటం తెలిసిందే. ఈ రోజున బాబు సర్కారుపై విమర్శలు చేస్తున్న పవన్.. వనజాక్షి ఇష్యూ జరిగినప్పుడు బాబుకు జానీ జిగిరీ దోస్తుగా ఉన్న సంగతి తెలిసిందే. తాను స్నేహితుడిగా ఉన్నప్పుడు వనజాక్షి ఇష్యూపై బాబుకు పర్సనల్ అల్టిమేటం ఇచ్చి.. సదరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేలా ఎందుకు ప్రయత్నించలేదు? ఒకవేళ.. బాబు ఆ పని చేయకుంటే.. ఒక మహిళా ఉద్యోగికి జరిగిన అన్యాయం మీద బాబు సర్కారుపై ఎందుకు ఫైట్ చేయలేదన్న ప్రశ్నను పవన్ సమాధానం ఇస్తే బాగుంటుంది. అన్యాయం జరిగినప్పుడు బాబుతో తనకు సత్ సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని పవన్ మర్చిపోకూడదు. అప్పుడేమో కామ్ గా ఉండి.. ఇప్పుడేమో బాబు సర్కారుపై విమర్శలు చేయటంలో అర్థమేంది పవనా?