పవన్ కు కళ్లజోడు వచ్చే.. మోడీకి పంచ్ పడే..

Update: 2016-11-10 15:34 GMT
నలభై దాటిపోయినా అప్పుడప్పుడు యూత్ ఫుల్ లుక్స్ తో ఇరగదీసే పవన్ కల్యాణ్ కు కళ్లజోడు వచ్చేసింది. అది కూడా ‘సైట్’. ఇలాంటి లోపాల్ని వీలైనంతగా మేనేజ్ చేస్తూ.. జనాలకు తెలీకుండా జాగ్రత్త పడటం సెలబ్రిటీలకు అలవాటు. కానీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఆయన తనలోని లోపాల్ని చెప్పుకోవటానికి యన అస్సలు వెనుకాడరు. అదే పవన్ కూ.. మిగిలిన వారికి వ్యత్యాసంగా చెప్పాలి.

అశేష ప్రజానీకం సాక్షిగా తనకున్న లోపాన్ని విప్పిచెప్పేందుకు ఏ మాత్రం సందేహించలేదు పవన్. అనంతపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించేక్రమంలో.. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ గురించి ప్రస్తావించే క్రమంలో ఆయన కొన్ని డాక్యుమెంట్లు చూపించారు. వాటిని చదివే క్రమంలో ఆయన కళ్లజోడు పెట్టుకున్నారు.

స్పెషల్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు తాను చాలా చదవాల్సి వచ్చిందని.. చివరకు సైట్ కూడా వచ్చిందని వ్యాఖ్యానించారు. అంతేకాడు.. కేంద్రం పుణ్యమా అని తనకు సైట్ వచ్చిందన్న ఆయన.. తన కళ్ల జోడుకు గ్రాంట్ మంజూరు చేయాలంటూ పంచ్ వేశారు. పవన్ కు కళ్లజోడు ఏమో కానీ.. కేంద్రానికి మాత్రం తనదైన శైలిలోపంచ్ వేశారు పవన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News