జమిలి ఎన్నికలకే పవన్ మద్దతు

Update: 2020-11-18 17:30 GMT
దేశంలో జమిలి ఎన్నికలు జరగటానికే తాను మద్దతు ఇస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. దేశమంతా జమిలి ఎన్నికల గురించి మాట్లాడటం మానేసిన తర్వాత పవన్ ఇపుడు తీరిగ్గా అదే అంశంపై మాట్లాడుతుండటం విచిత్రంగా ఉంది. బహుశా తన మిత్రుడు చంద్రబాబునాయుడు కూడా జమిలి ఎన్నికలపై బాగా ఇంట్రస్టు చూపుతున్న ప్రభావం ఏమైనా పవన్ మీద పడిందేమో అర్ధం కావటం లేదు. 2024 లోగానే జమిలి ఎన్నికలు జరుగుతాయని కూడా పవన్ జోస్యం చెప్పటమే విడ్డూరంగా ఉంది.

మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రం నుండి తనకున్న సమచారం ప్రకారం జమిలి ఎన్నికలు జరగటం ఖాయమంటూ చెప్పారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగాలన్నది తన అభిప్రాయంగా చెప్పారు. చాలా రాష్ట్రాలు ఇదే కోరుకుంటున్నట్లు కూడా పవన్ తేల్చేశారు. ఒకవైపు రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికల రచ్చ జరుగుతుంటే పవన్ మాత్రం దీనిపైన కాకుండా జమిలి ఎన్నికలపై మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది.

కొద్ది రోజులుగా బీజేపీ నేతృత్వంలోని నరేంద్రమోడి ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్వహణ గురించి మాట్లాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చట్టం చేసేందుకు అవసరమైన న్యాయపరమైన సంప్రదింపులు జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలోనే బీజేపీ మిత్రపక్షం హోదాలో పవన్ కూడా జమిలి ఎన్నికలపై స్పందించటం గమనార్హం.
Tags:    

Similar News