ఉత్త‌రాంధ్ర ఉద్య‌మానికి ప‌వ‌న్ మ‌ద్ద‌తు

Update: 2017-05-21 07:58 GMT
జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లో త‌న దూకుడును పెంచుతూ ముందుకు సాగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ప‌లు స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టిన ప‌వ‌న్ తాజాగా ప్రాంతీయ వెన‌క‌బాటుత‌నంపై దృష్టిసారించిన‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా ఆయ‌న ఉత్త‌రాంధ్ర ఉద్య‌మానికి సంఘీభావం ప్ర‌క‌టించారు. మాజీ మంత్రి, సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త కొణ‌తాల రామ‌కృష్ణ ఆధ్వ‌ర్యంలో విశాఖ‌లో ఏర్పాటుచేసి ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుత‌నం- ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు అనే స‌ద‌స్సుకు ప‌వ‌న్ సంఘీభావం ప‌లికారు. ముంద‌స్తు షెడ్యూల్ల వ‌ల్ల హాజ‌రుకాలేక‌పోతున్న‌ట్లు పేర్కొంటూ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుత‌నంపై నిర్వ‌హిస్తున్న స‌మావేశానికి హాజ‌రుకాలేక‌పోయిన సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ఇది... `` సభికులకు నమస్కారం, ఈ సభకు రాలేకపోయినందుకు బాధగా ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలోని వెనుకబాటుతనం నన్ను ఆవేదనకు గురి చేసే అంశాల్లో ఒకటి. పార్లమెంట్ మాజీ సభ్యులు, గౌరవనీయులు  కొణతాల రామకృష్ణ గారు నాతో ఫోన్లో మాట్లాడుతూ విశాఖ నగరంలో "ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ఒక సమావేశం ఏర్పాటు చేశాము. మీరు తప్పక రావాలి" అని కోరినప్పుడు నేను తప్పకుండా పాల్గొనవలసిన సభ ఇది అని అనిపించింది. అయితే నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నా కార్యక్రమాలన్నీ ముందుగానే నిర్ణయం జరిగిపోవడంతో సమయాభావం కారణంగా నేను ఈ సమావేశానికి హాజరుకాలేకపోతున్నాను.

మీ అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా కోసం జనసేన పోరాటం జరుపుతున్న సంగతి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతాలను మనం ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చని ఆశించాను. అందుకే ప్రత్యేకహోదా సాధనలో జనసేన మడమ తిప్పే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పేదరికం, నిరుద్యోగం, సాగునీరు, పరిశ్రమలు, వలసలు, ఆరోగ్యం వంటి సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. పోరాటాలకు పుట్టినిల్లు, కళలకు కాణాచి అయిన ఈ ప్రాంతం ఇప్పుడిలా వెనుకబడిపోవడం బాధాకరం. మన పాలకులకు ముందుచూపు లేకపోవడం, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం ఈ ప్రాంతం అణగారిపోవడానికి కారణమని జనసేన భావిస్తోంది. ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి జనసేన కృత నిశ్చయంతో ఉంది. అందుకు తొలి ప్రయత్నమే ఉద్దానంలో కిడ్నీ భాదితులకు బాసటగా నిలబడడం. ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి పోరాటం చెసేవారితో చేతులు కలపడానికి జనసేన సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తూ. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కొణ‌తాల రామకృష్ణ గారికి నా తరపున, జనసేన శ్రేణుల‌ తరపున అభినందనలు తెలియ‌జేస్తున్నాను`` అని ప‌వ‌న్ త‌న సంఘీభావాన్ని ప్ర‌క‌టించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News