పవన్ యాత్రకు బ్రేక్.. కారణం ఇదే..

Update: 2018-05-25 11:12 GMT
జనసేనాని జనంలోకి వచ్చారు.. జనం ఆయన్ను చూసి జనసంద్రంలా తరలివచ్చారు. దీంతో ఆయన సెక్యూరిటీకి తలకుమించిన భారమైంది. పవన్ కళ్యాన్ చుట్టూ రక్షణగా ఉండే చాలా మంది సెక్యూరిటీకి జనాన్ని కంట్రోల్ చేయడం తలకు మించిన భారమైంది. చాలామంది సెక్యూరిటీ సిబ్బంది పెనుగులాటలో గాయపడ్డారు. దీంతో పవన్ కళ్యాన్ తప్పనిసరి పరిస్థితుల్లో మొన్న తన యాత్రకు విరామం ప్రకటించారు. ఈరోజు కూడా రక్షణ సిబ్బంది కోలుకోకపోవడంతో రెండోరోజు కూడా పవన్ రోడ్డెక్కలేదు..

‘జనసేన అధినేత పవన్ కళ్యాన్ గారి వ్యక్తిగత భద్రతా సిబ్బంది గాయాల నుంచి పూర్తిగా కోలుకోనందున శుక్రవారం కూడా ఆయన కార్యక్రమాలు రద్దయ్యాయి.. శనివారం నుంచి పోరాట యాత్ర కొనసాగుతుంది.. ’ అని జనసేన పార్టీ నుంచి వచ్చిన అధికారిక సమాచారం.

శుక్రవారం పవన్ కళ్యాన్ గెస్ట్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రజలకు దూరంగా ఉన్నారు. కేవలం కొంతమంది నేతలు, విద్యార్థి నేతలతోనే సమావేశమయ్యారు. నిజానికి సెక్యూరిటీ లేకపోయినా విలేకరులతో ప్రజాసమస్యలపై మాట్లాడి తన అభిప్రాయాలను వెల్లడించవచ్చు. కానీ పవన్ ఆ పనిచేయలేదు. పోరాటయాత్రకు రెండో రోజు పూర్తిస్థాయిలో బ్రేక్ ఇచ్చారు. జనసేన కార్యకర్తలతో మాత్రమే సమావేశమయ్యారు.


Tags:    

Similar News