పవన్ కళ్యాణ్ 'రిపబ్లిక్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఏపీ ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలపై నటుడు పోసాని కృష్ణ మురళి అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పవన్ వ్యాఖ్యలను తప్పు పడుతూ ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దాంతో పవన్ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేసి కాల్స్ చేసి బూతులు తిడుతున్నారని.. అసభ్యకర మెసేజ్ లు పెడుతున్నారని పోసాని మరో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పవన్ తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులపై కూడా పోసాని అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించారు.
ఈ నేపథ్యంలో పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించబోతున్నారని తెలుస్తోంది. పోసాని పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారట. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోసాని మీద ఫిర్యాదు చేయనున్నాడని.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పవన్ పోలీస్ స్టేషన్ కు వస్తారని తాజాగా నివేదికలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
ఇకపోతే పోసాని తన ప్రెస్ మీట్ లో 'నీకూ ఓ ఆడపిల్ల ఉంది.. ఆ పిల్ల పెద్దదవుతుంది.. గుర్తుపెట్టుకో నేను బతికే ఉంటా.. రక్త కన్నీరు పెట్టుకుంటావు' అని వ్యాఖ్యానించడం బెదిరింపు కిందకు వస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. మైనర్ బాలిక బెదిరించాడనే నేరం కింద పోసాని ని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరోవైపు పవన్ కళ్యాణ్ మీద పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేయడాన్ని ఫ్యాన్స్ మరియు జనసేన మద్దతుదారులు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోసాని పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. జనసేన పార్టీ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శంకర్ గౌడ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. పోసాని ని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని కోరినట్లు తెలిపారు. ఇక పోసాని సైతం పవన్ కళ్యాణ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. అతని ఫ్యాన్స్ వల్ల తనకు ప్రాణహాని ఉందని.. తనకి ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ కారణమని పోసాని అన్నారు.