జేపీ... గతంలో అయితే జనతా పార్టీ నేతే గుర్తుకు వచ్చేవారు. అయితే సమాజం బాగు కోసం - ఎన్నికల సంస్కరణలు - అంతిమంగా సుపరిపాలన కోసం ఐఏఎస్ పదవిని తృణప్రాయంగా వదిలేసిన తెలుగు ప్రముఖుడు జయప్రకాశ్ నారాయణ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు జేపీ అంటే... మన జయప్రకాశ్ నారాయణే గుర్తుకు వస్తారు. ఎన్నికల్లో సంస్కరణల కోసం ప్రత్యేకంగా లోక్ సత్తా పేరిట ఓ సంస్థను ప్రారంభించిన జేపీ... నేర చరిత కలిగిన రాజకీయ నేతలపై ఏళ్ల తరబడి పోరు సాగించారు. ఫలితంగా ఎన్నికల్లో ఎంతమంది నేర చరితులు బరిలోకి దిగుతున్నారన్న విషయం జనాలకు తెలిసేలా చేశారనే చెప్పాలి. నేర చరితులంటే ఏమాత్రం భీతి లేని విధంగా ఎన్నికల్లో నిలిచిన వీరు నేరచరితులేనంటూ జేపీ వెల్లడించిన నివేదికలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమేనని చెప్పాలి. అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేసే జేపీ... వాటి ఫలితంగా తనకు ఎంత ఇబ్బందులు ఎదరవుతాయన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోరనే చెప్పాలి. 2009 ఎన్నికల్లో లోక్ సత్తా వేదికనే రాజకీయ వేదికగా మార్చుకుని బరిలోకి దిగిన జేపీ... హైదరాబాదులోని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన మినహాయించి లోక్ సత్తా తరఫున బరిలోకి దిగిన ఏ ఒక్కరు కూడా విజయం సాధించకపోవడం గమనార్హం.
అయినా ఇప్పుడు లోక్ సత్తా జేపీ గారి గురించి ఇంతగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే... జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఆయన భేటీ అవుతున్న విషయం మొదటిదైతే... దానికంటే కూడా ప్రాముఖ్యమైనది కేంద్ర బడ్జెట్ పై జేపీ ప్రశంసల జల్లు కురిపించిన విషయంగా చెప్పుకోవాలి. నిన్నటి ప్రెస్ మీట్ లో ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు జేపీ పేరును ప్రస్తాంవించిన పవన్ కల్యాణ్... వారిద్దరితో పాటుగా మేథావులతో కలిసి ముందుకు సాగుతానని ప్రకటించారు. ఈ క్రమంలో నేడు పవన్. జేపీ భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర బడ్జెట్ పై జేపీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తెలుగు నేలను పూర్తిగా నిరాదరణకు గురి చేసిన సదరు బడ్జెట్ పై తెలుగు నేల వ్యాప్తంగా ప్రత్యేకించి ఏపీలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతుండగా... కేంద్ర బడ్జెట్ బహు బాగుందంటూ జేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతృప్తికరంగా ఉందని జేపీ అభిప్రాయపడ్డారు. బడ్జెట్ గురించి తానేమైనా అంటే సంపన్నులు - ఎగువ మధ్య తరగతి వారు కొందరు బాధపడతారని - అయినా తన అభిప్రాయం మాత్రం బడ్జెట్ బాగుందనేనని ఆయన కుండబద్దలు కొట్టారు.
స్టాక్ మార్కెట్ కు బడ్జెట్ మేలు చేస్తుందని జేపీ తెలిపారు. స్టాక్ మార్కెట్ లో భారీ లాభాలను తెచ్చుకున్న వారి నుంచి కొంత పన్ను వసూలు చేయడం తప్పేమీ కాదని ఆయన అన్నారు. తన దృష్టిలో ఇది మంచి పరిణామమన్నారు. ఎక్కువకాలం పాటు పెట్టుబడులను కదల్చని వారి నుంచి స్వల్ప మొత్తంలో పన్ను వసూలు చేయడం మంచిదేనని పేర్కొన్నారు. ఇది అధర్మమైన పనేం కాదని అన్నారు. బడ్జెట్ తరువాత ధనికులు, పేదలపై ఎటువంటి సానుకూల ప్రభావం ఉంటుందన్న విషయమై ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు. పాలనలో మూడు ప్రమాణాలు అవసరమని జేపీ అన్నారు. గత ప్రభుత్వాలు చేయాల్సినవి పూర్తి చేయకపోవడంతో చాలా నష్టపోయామని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, చట్టబద్ద పాలన అని ఆయన అన్నారు. పేద ప్రజల ఆరోగ్య బీమా కోసం రూ.5లక్షలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం చాలా మంచి నిర్ణయమని అన్నారు. ఇది ఒక పెద్ద అడుగు అని చెప్పారు. కుటుంబానికి రూ.5లక్షలు అంటే.. 50కోట్ల జనాభాకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. నచ్చిన వైద్యుడిని ఫ్యామిలీ డాక్టర్ గా ఉంచుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించాలన్నారు. ప్రభుత్వ వైద్య శాలల్లో వసతులను మెరుగుపర్చాలని అన్నారు. పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలన్నారు.
జైట్లీ.. వ్యవసాయం గురించి చాలా మాట్లాడారు కానీ, అంతగా ఏం చేసినట్లు కనిపించలేదని జేపీ అన్నారు. రైతులు పంటకు మద్దతు ధర కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. దళారీ వ్యవస్థ లేకుండా చేస్తేనే రైతుకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఆ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. స్టోరేజీలను ఏర్పాటు చేయాలి. చట్టబద్ద పాలన గురించి బడ్జెట్ లో ఊసేలేదని జేపీ అన్నారు. అయితే - రోడ్లు - విద్యుత్ - రైల్వేల మెరుగుదలకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. తెలుగు ప్రజలం కాబట్టి మనం మన గురించి ప్రస్తావించాలని కోరుకుంటామని ఆయన అన్నారు. దానిలో తప్పులేదని అన్నారు. అయితే, రాష్ట్రాల వారీగా నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించలేరని అన్నారు. జాతీయ బడ్జెట్ కాబట్టి ప్రతీ రాష్ట్రాన్ని ప్రస్తావించలేరని అన్నారు. కేంద్ర బడ్జెట్లోని 24లక్షల్లో 12లక్షల కోట్లను రాష్ట్రాలకే కేటాయించారని చెప్పారు. కేంద్రం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోందని అన్నారు. మనకు ఏదో చేయాలని తెలుగు రాష్ట్రాలు కోరుకోవడంలో తప్పులేదని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగుతున్నాయని అన్నారు. ప్రస్తుత రాజకీయాలంటే చాలా ద్వేషం ఏర్పడిందని, స్వార్థ రాజకీయాలు చేసేవారిని తన్నాలని అనిపిస్తోందని జేపీ అన్నారు. ఎమ్మెల్యేలు జీతాలు వారికి వారు పెంచుకోవడం సరికాదన్నారు. మొత్తానికి కేంద్ర బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో నిరసనలు వ్యక్తమవుతుంటే... జేపీ మాత్రం తనదైన శైలిలో కేంద్ర బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించి అందరి దృష్టిని తనవైపునకు తిప్పేసుకున్నారు. మరి నేటీ భేటీలో ఈ విషయాన్ని పవన్... జేపీ వద్ద ప్రస్తావిస్తారో - లేదో చూడాలి.