సినీ నటుడు - జనశక్తి అధినేత - భూ సమీకరణ వ్యతిరేకి అయిన పవన్ కల్యాణ్ కు మరోసారి పని పడింది. ఆయన మరోసారి అమరావతికి వెళ్లి గళమెత్తడానికి అవకాశం వస్తోంది. ఉద్యమించడానికి ఇంకో అవకాశం వస్తోంది. మరి దానిని ఆయన ఉపయోగించుకుంటాడా లేడా అనేది చూడాలి.
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి దాదాపు 30 వేల ఎకరాలను ఇచ్చారు. కానీ తుళ్లూరు - మంగళగిరి మండలాల్లో పలువురు మాత్రం భూములు ఇవ్వడానికి ససేమిరా అన్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. రాయపూడి జమీందార్ హరీంద్రనాథ్ చౌదరి వంటి వారితో మంత్రులు స్వయంగా మాట్లాడినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. భూములు ఇచ్చేందుకు వీలు లేదంటే వీలు లేదని చెబుతున్నారు. దాంతో ప్రభుత్వం ఇక ఆఖరి అస్త్రాన్ని తీసింది. 652 ఎకరాల భూ సేకరణకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు సీఆర్ డీఏ కమిషనర్ శ్రీకాంత్ గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండేకు ప్రతిపాదనలు పంపారు. ఆయన అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలనలు చేయించారు. ఇక నోటిఫికేషన్ జారీ చేయడమే తరువాయి.
సీఆర్డీఏలోని ఏకంగా 16 గ్రామాల్లో భూ సేకరణ చేపట్టనున్నారు. రాయపూడి - ఉద్ధండరాయునిపాలెం - శాఖమూరు - వెంకటపాలెం - మల్కాపురం - దొండపాడు - ఐనవోలు - కొండమరాజుపాలెం - లింగాయపాలెం - నెక్కల్లు - నేలపాడు - తుళ్లూరు - వెలగపూడి - మందడం గ్రామాల్లో 652 ఎకరాలను సేకరించాలని వారంలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
భూ సేకరణకు అధికారులను కూడా నియమించారు. దీంతో ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో భూసేకరణ యుద్ధానికి తెర లేవబోతోంది. దాదాపు వెయ్యిమంది రైతుల వరకూ రోడ్డెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఆందోళన ఎటు మలుపు తిరుగుతుందోననే ఆందోళన నెలకొంది. మరి భూ సేకరణను వ్యతిరేకిస్తున్న పవన్ కల్యాన్ వారికి మద్దతు ఇస్తారా ఇవ్వరా?