కరోనా.. లాక్ డౌన్.. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏపీలో రాజకీయం చేసే జనసేనాధినేతపవన్ కల్యాణ్ హైదరాబాద్ లోనే ఉండిపోవటం తెలిసిందే. చాలా కాలం తర్వాత మళ్లీ ఆయన అమరావతికి రానున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నఆయన.. వీలు చూసుకొని ఏపీకి రానున్నారు.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రెండు రోజులు ఉండటంతో పాటు.. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి కావటంతో.. ఆ అంశాల్ని రివ్యూ చేయనున్నట్లు చెబుతున్నారు. పవన్ ఏపీ పర్యటనకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
ఈ నెల 17.. 18 (మంగళ.. బుధ)లలో మంగళగిరిలో ఉండనున్నారు. పార్టీ కార్యాక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తూర్పు.. పశ్చిమ గోదావరిలతో పాటు కృష్ణా.. గుంటూరు జిల్లాల ముఖ్యనేతలతో పవన్ భేటీ కానున్నారు. 17న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్న పవన్.. 18న మాత్రం అమరావతికి చెందిన మహిళా రైతులతో సమావేశం కానున్నారు. వారి సమస్యల్ని తెలుసుకోనున్నారు.
క్రియాశీలక సభ్యత్వాల్ని మరో32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు. ఈ 32 నియోజకవర్గాల ఇంచార్జిలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. సభ్యత్వ నమోదుకోసం పార్టీ ఐటీ విభాగం రూపొందించిన యాప్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. చాలా రోజుల తర్వాత మంగళగిరికి రానున్న పవన్ కల్యాణ్ షెడ్యూల్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.