జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. తనను తాను లార్జర్ దేన్ ది లైఫ్ స్ధాయిలో ఊహించుకోవటం, మిగిలిన వారందరు తన ముందు పిపీలకాలే అన్నట్లుగా మాట్లాడటం చాలా ఎక్కువగా ఉంటుంది. పవన్ మాటలను భరించటమంటే మామూలు విషయంకాదు. చెప్పిందాన్నే పదే పదే చెప్పటం పవన్ కు ఎలాగుందో కానీ వింటున్న జనాలకు మాత్రం చాలా విసుగుతెప్పిస్తోంది. హైదరాబాద్ ఫిలిం ఫంక్షన్లో, తర్వాత రాజమండ్రి , ఆ తర్వాత అనంతపురంలో మాట్లాడిన మాటలు తాజాగా హైదరాబాద్ లో కూడా రిపీట్ చేశారు.
కాకపోతే ఇక్కడ కొత్తగా చెప్పిందేమంటే తెలంగాణా ప్రజలు తనను పిలిస్తేకానీ తెలంగాణాకు రానని స్పష్టంగా ప్రకటించారు. పిలిస్తే కానీ రానని చెప్పిన వపన్ కు తెలంగాణా జనాలు బహశా ధన్యవాదాలు చెప్పుకుంటారేమో చూడాలి. పవన్ మరచిపోయిన విషయం ఏమిటంటే జనాలెవరు కూడా ఏ రాజకీయ నేతను వచ్చి పార్టీ పెట్టమని అడగరు. పార్టీ పెట్టడం అవసరమని అనుకుంటే నేతలే పార్టీలు పెట్టుకుని జనాల దగ్గరకు వెళతారన్న కనీస ఇంగింతం కూడా పవన్లో లోపించటమే విచిత్రంగా ఉంది.
ఒకవైపేమో తెలంగాణా స్పూర్తితోనే తాను రాజకీయపార్టీ పెట్టినట్లు చెబుతునే మరోవైపు తెలంగాణా ప్రజలు తనను రమ్మని పిలిస్తేకానీ వచ్చేదిలేదని చెప్పటం పవన్ కు మాత్రమే చెల్లింది. ఇంకా విచిత్రం ఏమిటంటే తెలంగాణా సమస్యలపై పోరాటాలు చేసేవారినే అసెంబ్లీకి పంపేందుకు కృషి చేస్తానని ప్రకటించటం. ప్రతిఒక్కరు సమస్యలపై పోరాటాలు చేస్తామనే చెబుతారు. గెలిచిన తర్వాత వాళ్ళు ఏమి చేస్తారన్నదే అసలైన సమస్యగా మారింది.
మొత్తంమీద తనకు ఎవరన్నా భయంలేదని, తాను ఎవరికీ భయపడేది లేదని పవన్ ఇక్కడ కూడా పదే పదే ప్రకటించుకోవటమే విడ్డూరంగా ఉంది. అసలు పవన్ ఎవరికి భయపడాలి ? ఎవరు భయపెట్టారు ? ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు పవన్ను పట్టించుకుంటున్నదెవరు ? అధికార వైసీపీ అయితే పవన్ను పట్టించుకోవటమే లేదు. అనవసరంగా పవన్ వైసీపీ నేతలను కెలికితేనే వాళ్ళు గట్టిగా తగులుకుంటున్నారంతే. ఇపుడు వైసీపీ నేతలు-పవన్ మధ్య జరుగుతున్న వివాదం కూడా అలా మొదలైందే.
తనంతట తానుగా రాజకీయపార్టీ పెట్టిన పవన్ తాజాగా మాత్రం తెలంగాణా ప్రజలు తనను ఆహ్వనిస్తేనే వస్తానని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఏ ప్రజలు ఎవరినీ ఆహ్వానించరనే విషయాన్ని ముందుగా పవన్ గ్రహించాలి. ప్రజా సమస్యలపై ఎవరికి వాళ్ళుగా వచ్చి పోరాటాలు చేసేవారినే జనాలు ఒకసారి కాకపోయినా మరోసారన్నా ఆధరిస్తారు. కాబట్టి పవన్ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తే మంచిది. అయినా తన దగ్గర డబ్బులు లేవని కాబట్టే తెలంగాణాలో రాజకీయం చేయటం లేదని అప్పట్లోనే చేసిన ప్రకటనకు అర్ధమేంటో ?