ఇక్కడ ఎవరి ఆట వారు ఆడాలి. ఎవరి రాజకీయం వారు చేయాలీ, ఇది రూల్. కానీ వైసీపీ నేతలు తమ ఆటను వదిలేసి జనసేనాని వైపు చూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తీరు చూస్తే ఆయన ఏ రోజూ వైసీపీని కనీసంగా కూడా సాఫ్ట్ కార్నర్ తో చూడలేదు. ఆయన ప్రజారాజ్యంలో యువ రాజ్యం అధినేతగా ఉన్నప్పటి నుంచే వైఎస్సార్ ఫ్యామిలీ మీద గురి పెట్టారని చరిత్ర వెనక్కి వెళ్తే అర్ధమవుతోంది. ఆయన ప్రజారాజ్యం ప్రచారం చేస్తూనే కాంగ్రెస్ నాయకుల పంచెలూడగొట్టాలంటూ ఆ రోజుల్లో చేసిన వ్యాఖ్యలు దుమ్ము రేపాయి. ఆనాడు పంచె కట్టిన ఏకైక రాజకీయ నేత, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నది కూడా వైఎస్సారే. ఆయనను ఉద్దేశించే పవన్ ఆ ఘాటు వ్యాఖ్యలు చేశారని అంతా చెప్పుకొచ్చారు కూడా.
ఇక వైఎస్సార్ మరణం తరువాత పవన్ గురి జగన్ మీద పెట్టారు. తాను వైసీపీని అడ్డుకునేందుకే టీడీపీ బీజేపీ కాంబోకు సపోర్ట్ చేస్తున్నట్లుగా పవన్ 2014 ఎన్నికల వేళ చెప్పారు. దాని కోసం ఆయన పోటీ చేయడాన్ని కూడా త్యాగం చేసుకున్నారు అంటే ఆయనకు జగన్ మీద వైసీపీ మీద ఎంతటి వ్యతిరేకత ఉందో అర్ధమవుతుంది. ఇక 2019 ఎన్నికలకు ముందు ఆయన ఒకే మాట అంటూ ఉండేవారు. తాను ఎట్టి పరిస్థితుల్లో జగన్ని సీఎం కానీయను అని. అంటే తాను సీఎం కాకపోయినా ఫరవాలేదు జగన్ మాత్రం సీఎం కాకూడదు అన్న పంతమే పవన్ మాటలలో నాడు కనిపించింది.
ఇపుడు చూస్తే 2024 ఎన్నికలు వస్తున్నాయి. పవన్ పవర్ షేరింగ్ విషయం, పొత్తుల విషయం గురించి టీడీపీ బీజేపీలకు మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఆయన తన రాజకీయం తాను చేసుకుంటున్నారు. తన బాధ తాను పడుతున్నారు. ఇక్కడ కూడా ఆయన వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అన్న మాటకు ఈ రోజుకీ కట్టుబడే ఉన్నారు. అంటే పవన్ టార్గెట్ జగన్ మాజీ కావడమే. అలాంటి పవన్ కి రాజకీయ సలహాలు ఇస్తూ ఆయనకు ఏది మంచో ఏదో చెడు ఏదో చెప్పడానికి వైసీపీ నేతలు తెగ ఆరాటపడుతు బరిలోకి దిగడమే ఇక్కడ చిత్ర విచిత్రం.
లేటెస్ట్ గా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే పవన్ కి ఉచిత సలహాలు కొన్ని ఇచ్చారు. పవన్ పొత్తులతో ఎన్నడూ సీఎం కాలేరు కాబట్టి విడిగా పోటీ చేస్తే 2024 కాకపోయినా 2029 అయినా సీఎం అవుతారని, మరి పవన్ 2019లో సీఎం అయితే జగన్ మూడు దశాబ్దాల సీఎం కల ఏంటో బాలినేని కావాలనే చెప్పలేదా. లేక మరచిపోయారా. సొంత పార్టీ అధినేత పదికాలాలు సీఎం గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ తమను పూర్తిగా ద్వేషిస్తూ నిత్యం విమర్శలు చేసే పవన్ సీఎం కావడం గురించి బాలినేని లాంటి వారికి ఎందుకు అంత ఆసక్తి అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది.
ఇక ఇదే మాటను మరో మాజీ మంత్రి కొడాలి నాని కూడా అంటున్నారు. ఆయన కూడా ఈ మధ్య పవన్ విషయంలో సాఫ్ట్ కార్నర్ తో మాట్లాడుతున్నారు. చంద్రబాబు వలలో పవన్ పడకూడదని, ఆయన వెన్నుపోటు రాజకీయాలకు బలి కాకూడదని సలహాలు ఇస్తున్నారు. మరి కొడాలికి పవన్ మీద ఎందుకు ఇంత ప్రేమ అకస్మాత్తుగా వచ్చిందో ఎవరికీ అర్ధం కాదు, పవన్ రాజకీయాలు చేయలేడని, అవగాహన లేదని అన్నది కూడా ఇదే కొడాలి నాని, మరి పవన్ రాజకీయంగా బాగుండాలి అంటే చంద్రబాబు జట్టు నుంచి వేరు పడాలని శ్రేయోభిలాషిలా కోరుకుంటోంది కూడా ఇదే కొడాలి నాని. మరి దీని భావమేని నాని గారు అని ఆయన్నే అడగాలి.
ఇక కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కి కూడా హఠాత్తుగా పవన్ మీద ప్రేమ పొంగుతోంది. ఆయన కూడా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్ధిగా కూటమి ప్రకటించకపోతే నిజమైన కాపులు ఎవరూ ఆ కూటమికి ఓటు వేయరని అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ కి శ్రేయోభిలాషులు మాదిరిగా రాజకీయ సలహాలు వైసీపీ నేతలు ఇవ్వడం నిజంగా విశేషంగా చెప్పుకోవాలి.
అయితే పవన్ వీరి రాజకీయాలను ఎపుడో గమనించేసారు. అందుకే ఆయన తన క్యాడర్ కి జర భద్రం అని చెబుతున్నారు. వైసీపీ ఎన్ని గేమ్స్ ఆడినా ఎన్ని సూక్తులు చెప్పినా ఎంత మంచిగా మాట్లాడినా పవన్ అన్న క్యారక్టర్ ఏనాడూ వైసీపీ వైపు టర్న్ అవదు, సాఫ్ట్ కార్నర్ తో చూసేది అంతకంటే ఉండదు, ఇది సామాన్యుడుకి కూడా అర్ధమైన విషయం. మరి వైసీపీ నేతలు పవన్ సీఎం ఎలా కావాలీ, ఎలా చేస్తే అవుతారు అంటూ రిసెర్చులు చేస్తూ తమ టైమ్ వేస్ట్ చేసుకునే బదులు ఆ సలహాలూ సూచనలు ఏవో తమ పార్టీకి ఇచ్చుకుంటే బాగుంటుంది కదా అన్నదే చాలా మంది మాట.