జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరోసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 12న ఇక్కడి రణస్థలంలో యువశక్తి పేరిట ఆయన సభను పెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగానే ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు.. యువతను టార్గెట్ చేయాలనే లక్ష్యంతో ఉన్న జనసేన.. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఇప్పటికే పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్.. ఇక్కడ వరుస పర్యటనలు చేశారు. యువతను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కూడా తాజాగా వీడియో సందేశం ఒకటి విడుదల చేశారు. యువశక్తిని ఎందుకు నిర్వహిస్తున్నట్టో చెప్పారు. దేశంలో యువత ఎక్కువగా ఉన్నారని చెప్పిన ఆయన.. ఈ శక్తిని సరైన మార్గంలో నడిపించాలనేదే తమ వ్యూహమని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయి.. యువత నానా ఇబ్బందులు పడుతున్నారని పవన్ అన్నారు. చదువుకునేందుకు, ఉద్యోగాల కోసం.. పొరుగు రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ఏటా జాబ్ క్యాలెండ ర్ ఇస్తామని చెప్పిన వైసీపీ మోసం చేసిందన్నారు.
యువత ఇప్పటికైనా మేల్కొనాల్సిన అవసరం ఉంద ని, వారికి అవకాశాలు లేకకాదని.. ఈ ప్రభుత్వానికి చేయాలనే చిత్తశుద్ధి లేకనే ఇలా చేస్తున్నారని పవన్ దుయ్యబట్టారు. ఈ క్రమంలో రణస్థలం యువశక్తి సభపై అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఎలాంటి రాజకీయ మెరుపులు మెరుస్తాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.