ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచుగా సటైర్లు పేలుస్తున్న విషయం తెలిసిందే. గతంలో అనేక కామెంట్లు చేశారు. ముఖ్యంగా `మూడు ముక్కల సీఎం` అంటూ విజయనగరంలో చేసిన వ్యాఖ్య బలంగా ప్రజల్లోకి వెళ్లింది. ఇక, తాజాగా మరోసారి పవన్.. జగన్‌పై విరుచుకుపడ్డారు. తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి కూత వేటు దూరంలో ఉన్న ఇంట్లో అంధ యువతిపై అత్యాచార యత్నం.. హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ ఉందా? అని ప్రశ్నించారు.
సీఎం నివాసం దగ్గరలోనే ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని ప్రశ్నించారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందన్నారు. తాడేపల్లిలోనే గతంలో జరిగిన రేప్ కేసులో ఒక నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని విమర్శించారు. ''తన నివాసం పరిసరాల పరిస్థితులనే సీఎం సమీక్షించుకోలేకపోతే ఎలా? తల్లి పెంపకంలోనే లోపం ఉందని చెప్పే మంత్రులు ఉన్న ప్రభుత్వమిది.. దొంగతనానికి వచ్చి రేప్ చేశారని చెప్పే మంత్రులు గల ప్రభుత్వమిది`` అని మండి పడ్డారు.
అంతేకాదు.. సీఎం ఇంటి సమీపంలోనే యువతులపై అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా కమిషన్ ఏం చేస్తోంది? అని నిలదీశారు. గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ని మార్చారని మండిపడ్డారు. మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే అని దుయ్యబట్టారు. యువతిని కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణ ఘటనలపై అన్ని వర్గాలు స్పందించాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.