సిగ్గుతో తలదించుకోవాలి..ఆ చిన్నారి కుటుంబానికి పవన్ పరామర్శ

Update: 2021-09-15 13:38 GMT
హైదరాబాద్‏ లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అభం, శుభం తెలియని చిన్నారిని అత్యంత దారుణంగా హతమార్చిన మానవ మృగం కోసం పోలీసులు వేట ప్రారంభించారు. అతడి ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఈ ఘటనకు పాల్పిడిన నిందుతుడిని ఎన్‏ కౌంటర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పవనకళ్యాణ్ జోక్యం చేసుకోవాలని బాధిత కుటుంబాలు ఈమధ్యే వేడుకోవడం వైరల్ అయ్యింది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా ఆ చిన్నారి కుటుంబాన్ని ఈ రోజు పరామర్శించారు.

చిన్నారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తంచేసినప్పుడే పోలీసులు స్పందించాల్సి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేదని పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. పార్టీలకతీతంగా అందరూ ఈ ఘటనను ఖండించాలన్నారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి సహాయం, ఓదార్పు అందించాలన్నారు. ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందో వెంటనే ఆలోచించి చేయాల పవన్‌ అన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయం ఇది అంటూ చెప్పారు. దోషికి కఠిన శిక్ష పడే వరకూ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని పవన్‌ వెల్లడించారు. అలాగే మీడియా కూడా ఈ విషయాన్ని ఎక్కువ మందికి తెలిసేలా కృషి చేయాలని కోరారు.

ఇదిలా ఉంటే .. ఇప్పటికే నిందితుడి ఆచూకీ కోసం రివార్డు సైతం ప్రకటించిన పోలీసులు. ప్రత్యేక బృందాలతో గాలింపుచర్యలు చేపట్టారు. దారుణం జరిగి ఇప్పటికే వారం రోజులు కావొస్తున్న నిందితుడి జాడ మాత్రం దొరకలేదు. చిన్నారిని రేప్‌ చేసి, కిరాతకంగా మర్డర్‌ చేసేసి పారిపోయాడు. మరోవైపు, ప్రజా సంఘాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. సీసీటీవీల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దాదాపు 1000 సీసీటీవీ కెమెరాల డేటాను అనాలసిస్ చేస్తున్నారు.


Tags:    

Similar News