పవన్ సీఎం : కాపులు నమ్ముతున్నారా...?

Update: 2023-06-15 20:00 GMT
పవన్ కళ్యాణ్ నేనే సీఎం అవుతాను అని వారాహి రధమెక్కి చెప్పుకొచ్చారు. ప్రజల ఆశీర్వాదం దానికి కావాల ని ఆయన అన్నారు. అదే సమయంలో తాను ఈసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా రాకుండా ఎవరూ అడ్డుకుంటారో చూస్తాను అని గర్జించారు. దాంతో పవన్ టార్గెట్ సీఎం సీటా లేక ఎమ్మెల్యే పదవా అన్నది అర్ధం కావడంలేదు అంటున్నారు.

మరో వైపు చూస్తే గత నెల మంగళగిరి లో మీడియా మీటింగు లో పవన్ కళ్యాణ్ మాట్లడుతూ తాను సీఎం రేసు లో లేను అన్నట్లుగా మాట్లాడారు. సీఎం పదవి మనకు ఎవరిస్తారు అని ఆయన వ్యాఖ్యానించారు. నలభై ఎనిమిది నుంచి యాభై శాతం దాకా ఓట్లు మనకు వస్తేనే ముఖ్యమంత్రి పదవి దక్కేది అని కూడా తేల్చేశారు.

ఇపుడు కత్తిపూడి జంక్షన్ వద్ద మాత్రం సీఎం పదవి ఇస్తే సంతోషంగా తీసుకుంటాను అని పవన్ అంటున్నారు. ఇంతకీ పవన్ కి సీఎం పదవి ఎవరు ఇవ్వాలి  అన్నది ఇక్కడ ప్రశ్నగా ముందుకు వస్తోంది. సీఎం అయినా మరే పదవి అయినా జనం ఇవ్వాలనుకుంటే నిరంతరం జనం లో ఉండాలి. నాలుగేళ్ళ వైసీపీ ఏలుబడి లో జనసేన ప్రజల లోకి వచ్చి పోరాటాలు చేసింది తక్కువగానే ఉంది.

పవన్ కళ్యాణ్ మీద అదే అతి పెద్ద మైనస్ గా ఉంది. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి అలా వెళ్ళిపోతారు అని కూడా కామెంట్స్ ఉన్నాయి. పోనీ నాలుగేళ్ళు పక్కన పెట్టినా చివరి ఏడాది అయినా గట్టిగా విగరస్ గా తిరిగితే జనం మనసు మారవచ్చు ఆల్టర్నెషన్ కోరుకుంటే అవకాశం ఉండొచ్చు. కానీ పవన్ విడి గా వస్తానో ఉమ్మడి గా వస్తానో అని మరో డౌట్ పెట్టేశారు.

ఒక వైపు పొత్తుల తోనే ఈసారి ప్రయాణం అని పార్టీ సమావేశాల్లో చెబుతున్న పవన్ జనసేన ప్రభుత్వం వస్తే అని కత్తిపూడి మీటింగు లో మాట్లాడారు. జనసేన ప్రభుత్వం రావాలీ అంటే మొత్తం 175 సీట్లకు జనసేన పోటీ చేయాలి. అందులో మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు రావాలి. అపుడు పవన్ సీఎం అయ్యేది. జనసేన ప్రభుత్వం ఏర్పాడేది.

పొత్తు లతో ఎన్నికలకు వెళ్తే జనసేన కు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందో తెలియదు. ఇక ఆ కూటమి లో అతి పెద్ద పార్టీగా టీడీపీ నే ఉంటుంది. కూటమి గెలిస్తే కచ్చితంగా చంద్రబాబు సీఎం అవుతారు అన్నది అందరికీ తెలిసిందే. మరి కూటమి కడతాం ఎన్నికల కు వ్యూహంతో వెళ్తామని ఒక వైపు చెబుతున్న పవన్ కళ్యాణ్ మరో వైపు జనసేన ప్రభుత్వం వస్తుందని చెప్పడాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నదే ఆసక్తికరంగా ఉంది.

దాని కంటే ముందు గోదావరి జిల్లాల్లో అతి పెద్ద సంఖ్యలో ఉన్న కాపులు నేనే సీఎం అని పవన్ అంటున్న మాటల ను నమ్ముతున్నారా అన్నది కూడా చర్చగా ఉంది. నిజానికి కాపుల కు తమ సామాజికవర్గం నుంచి ఒకరైనా సీఎం కావాలని ఉంది. పవన్ అయితే బాగుంటుందని కూడా ఉంది.

కానీ పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తారో లేదో తెలియదు. పొత్తు లతో వస్తే కచ్చితంగా కాపుల కల నెరవేరదు. ఆ సంగతి పవనే చెప్పేశారు. వేరే పార్టీ వారు మనకు సీఎం పోస్టు ఎందుకు ఇస్తారని ఆయన గతంలో అన్న మాటలూ ఉన్నాయి. మొత్తాని కి మన ప్రభుత్వం మన వరాలు మన హామీలు, నేను సీఎం అంటూ పవన్ చేస్తున్న ప్రకటనల పట్ల సామాన్య జనాలు ప్రత్యేకించి కాపులు ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్న దానిని బట్టే వారాహి రధ యాత్ర విజయం అన్నది ఆధారపడి ఉంది అంటున్నారు.

Similar News