ఏపీలో మరో ఇరవై నెలలలో ఎన్నికలు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం అయితే 2024 ఏప్రిల్ లో ఎన్నికలు జరగడం ఖాయం. ఏపీలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఈ మూడూ ప్రాంతీయ పార్టీలే కావడం విశేషం. రాజకీయాల్లో సీనియర్ జూనియర్ అన్న లెక్కలు నేతల వరకే తప్ప ప్రజలకు అది వంటబట్టని విషయం. ఆ విధంగా చూస్తే రేసులో పవన్ కూడా ఉండడం ఖాయమని చెప్పాలి.
ఏపీలో ఉన్న పదమూడు ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో అన్ని చోట్లా పట్టు లేదని అంటారు. అధికార వైసీపీ విషయమే తీసుకుంటే రాయలసీమలో స్ట్రాంగ్ గా ఉంది. కోస్తాలో మాత్రం బాగా తగ్గుతోంది. ఇక తెలుగుదెశం చూస్తే ఉత్తర కోస్తాలో బాగా బలం పుంజుకుంది. రాయలసీమలో మాత్రం పెద్దగా పెరగలేదు. ఇక జనసేన విషయానికి వస్తే ఉభయ గోదావరి జిల్లాలలో గట్టిగానే ఉంది మరి.
ఈ విధంగా తరచి చూస్తే ఏ పార్టీకి అయినా కొన్ని జిల్లాలు మాత్రమే చేతిలో ఉన్నాయి తప్ప మొత్తం పదమూడు మావే అని జెండా ఎగరేసే సీన్ లేదు. అయితే బలం ఉన్న చోట దాన్ని నిలబెట్టుకుని మిగిలిన చోట్ల ఎంతమేరకు ప్రభావితం చేస్తారు అన్న దాని మీదనే విజయం ఆధారపడి ఉంటుంది. అంటే ఏపీవ్యాప్తంగా కూడా తమ ప్రభావాన్ని చూపించడం కోసం మూడు పార్టీలు బాగానే పరిశ్రమించాల్సి ఉంటుంది.
ఇక ఏపీ పాలిటిక్స్ లో కొత్త రకం లాజిక్ ఇపుడు చర్చకు వస్తోంది. అదేంటి అంటే ఈసారి పవన్ కి ఎందుకు చాన్స్ ఇవ్వకూడదూ అని. అదేలా అంటే విభజన ఏపీలో తొలిసారి 2014లో ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు జనాలు ఓటేశారు. నాడు అనుభవం, అభివృద్ధి అన్న అంశాలే బాబుని సీఎం గా నిలబెట్టాయి.
ఆయన హయాంలో రాజధాని లేదు, అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు తప్ప మరేమీ లేవు. పోలవరం అలాగే ఉంది. ఏపీకి అప్పులు కూడా నాడే మొదలయ్యాయి. సంక్షేమం కూడా పెద్దగా లేదు. మొత్తానికి బాబు ఏలుబడిని చూసేసిన ఏపీ జనాలు విసుగెత్తి జగన్ని ఎన్నుకున్నారు. జగన్ తాను స్వర్గాన్ని తెస్తానని ప్రామిస్ చేసి మరీ గద్దెనెక్కారు.
కానీ ఆయన కూడా మూడు రాజధానులు అంటూ కంఫ్యూజ్ చేశారు. పైగా ఏపీకి ఒక రాజధాని అంటూ లేకుండా పోయింది అన్న అసంతృప్తి నిండా జనాలలో ఉంది. పోలవరం మా హయాంలోనే పూర్తి అని డబ్బాలు కొట్టినా 2024 దాకా ఆ ఊసు ఎత్తవద్దు అని కేంద్రం చెప్పేసింది. మంత్రి అంబటి రాంబాబు కూడా అదే అంటున్నారు. సో జగన్ కూడా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏమీ చేయలేదు. పరిశ్రమలు రాలేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం చేశామని చెబుతున్నా జనాలకు ఎక్కడంలేదు.
దాంతో ఇపుడు జనం ఎవరికి ఓటేస్తారు అంటే ఫ్రెష్ గా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు అని అంటున్నారు. మూడు పార్టీలు ముగ్గురు నేతలలో ఇద్దరిని జనాలు చూసేశారు. ఇక చూడాల్సిన సినిమా ఏదైనా ఉంది అంటే పవన్ కళ్యాణ్ దే అని అంటున్నారు. పవన్ జాగ్రత్తగా చేసుకుంటే ఆయన జనాలను నమ్మించగలిగితే ఏపీకి దశ దిశ తాను చూపించగలను అని విశ్వాసం పాదుగొల్పితే మాత్రం కచ్చితంగా చాన్స్ ఇచ్చేందుకు జనాలు అయితే సిద్ధంగా ఉన్నారు. మరి లాస్ట్ పంచ్ తనదైతే ఆ కిక్కే వేరబ్బా అని గబ్బర్ సింగ్ అంటాడు. మరి ఈ పొలిటికల్ గబ్బర్ సింగ్ లాస్ట్ పంచ్ తనదే అంటాడా. వెయిట్ అండ్ సీ.