ఏపీలో రాజకీయం అంతకంతకూ ముదిరిపోతోంది. రోజులు గడిచే కొద్దీ రాజకీయం వ్యక్తిగతంగా తీసుకునే పరిస్థితి రాజకీయ పార్టీల అధినేతలే కాదు.. నేతలకు.. చివరకు కార్యకర్తలకు.. సానుభూతి పరుల మధ్య కూడా దూరం అంతకంతకూ పెరుగుతుందే తప్పించి.. తగ్గిపోతున్న పరిస్థితి కనిపించటం లేదు. దీనికి తోడు డైలీ బేసిస్ గా ఏదో ఒక పరిణామం చోటు చేసుకోవటం.. దానికి సంబంధించిన స్పందనలతో వాతావరణం మరింత వేడెక్కుతోంది.
తాజాగా ఇప్పటం గ్రామంలో రహదారుల్ని విస్తరించే క్రమంలో పెద్ద సంఖ్యలో ఇళ్లు.. షాపుల్ని కొట్టేయటం తెలిసిందే. అయితే.. ఈ కొట్టేయటం వెనుక డెవలప్ మెంట్ కంటే కూడా రాజకీయ కక్ష్యే ఎక్కువన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. ఇప్పటం ఊరి శివారులోనే జనసేన ప్లీనరీకి తమ పొలాల్ని ఇచ్చారన్న కోపంతో అధికారపక్షం అధికారుల్ని ప్రయోగించిందని.. రోడ్ల విస్తరణలో భాగంగా వెనుకా ముందు చూసుకోకుండా తమ ఆస్తుల్ని ధ్వంసం చేయటమే లక్ష్యమన్నట్లుగా అధికారులు వ్యవహరించారన్న ఆరోపణ ఉంది.
తనను అభిమానించిన ఒక్క కారణంగా.. తన అభిమానులు ఆస్తుల్ని పోగొట్టుకోవటాన్ని సీరియస్ గా తీసుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. భారీ ఎత్తున తరలి వచ్చి.. ఆస్తుల్ని నష్టపోయిన వారిని ఊరడించటమేకాదు.. వారికి అండగా నిలుస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ తీరు మీద పవన్ కీలక వ్యాఖ్య చేశారు. ఆ మాటకు వస్తే వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి.
తనను అభిమానించే వారి ఆస్తుల్ని కూల్చేయటాన్ని తీవ్రంగా తప్పు పట్టిన పవన్ కల్యాణ్.. ఎప్పుడూ లేనిది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇడుపుల పాయను లక్ష్యంగా చేసుకొని మాట్లాడినట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇడుపుల పాయలో హైవే వేస్తానని వ్యాఖ్యానించటం సంచలనంగా మారింది. పవన్ లాంటి అధినేత నోటి నుంచి అదే పనిగా ఘాటు విమర్శలు రావటం అంత మంచిది కాదు. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం పని చేసిన రీతిలో.. దీన్నే తర్వాతి పాలకులు ఫాలో అయితే.. తాను చేసిన తప్పులకు జగన్ ఎంతలా ఆవేదన చెందాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా అధికారం శాశ్వితం కాదన్నది వాస్తవం. దానిని గుర్తెరిగి వ్యవమరిస్తేనే మంచిదన్న మాట వినిపిస్తోంది. మరేం చేస్తారో చూడాలి.