జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. బందరు బహిరంగసభలో పవన్ మాట్లాడిన మాటలు విన్నవాళ్ళందరు ఇలాగే చెప్పుకుంటున్నారు. అదేమిటంటే జనాలను తాను నమ్మరట. కానీ జనాలు మాత్రం పవన్ను నమ్మాలట. వచ్చేఎన్నికల్లో పార్టీ ఒంటరిగా పోటీచేయటం పెద్ద కష్టమేమీ కాదన్నారు. అయితే జనాలంతా తమ పార్టీకే ఓట్లేస్తారని గ్యారెంటీ ఏముందని అడగటమే విచిత్రంగా ఉంది. ఇక్కడే పవన్లోని అజ్ఞానం బయటపడింది. జనసేనకే ఓట్లేస్తామని జనాలు పవన్ కు బాండు రాసివ్వాలా ?
జనాలు ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వరు. నేతలే జనాలను నమ్మాలి. జనాల్లో తిరగాలి. జనాల్లో నమ్మకాన్ని సంపాదించుకోవాలి. మీకు తాను ఉన్నానని నేత ముందు జనాల్లో నమ్మకం కలిగిస్తేనే తర్వాత జనాలు నేతలను నమ్ముతారు. ఈ చిన్న లాజిక్ మరచిపోయిన పవన్ పదేపదే జనాలపై తనకు నమ్మకంలేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. గ్రామస్ధాయిలో సర్వేలు చేయించుకున్న తర్వాత, జనాలంతా తమపార్టీకి ఓట్లేస్తారనే నమ్మకం కుదిరితేనే జనసేన ఒంటరిపోటీకి ఆలోచిస్తుందని చెప్పారు.
ఇలా చెప్పిన కొద్దిసేపటి తర్వాత ఒంటరిగా పోటీచేసి జనసేన బలిపశువు అవటానికి సిద్ధంగా లేదని ప్రకటించారు. అంటే జనాలపై పవన్ కు ఏమాత్రం నమ్మకంలేదని తేలిపోయింది. పైగా తప్పుడు హామీలిచ్చిన జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్న జనాలు నిజాయితీతో రాజకీయాలు చేస్తున్న తనను ఎందుకు నమ్మటంలేదని పవన్ అడగటం విచిత్రంగానే ఉంది. ఇది నిజమే అయితే ఇందుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా పవన్ పైనే ఉంది.
తప్పుడు హామీలిస్తున్న జగన్ను ఎందుకు జనాలు నమ్ముతున్నారు ? నిజాలు చెప్పినా జనాలు తనను ఎందుకు నమ్మటం లేదనే విషయాన్ని పవనే ఆలోచించుకోవాలి. అప్పుడు జగన్ చెప్పిన అబద్ధాలు ఏమిటి, తాను చెప్పిన నిజాలు ఏమిటనేది పవన్ కే తెలుస్తుంది. ఏదేమైనా బందరు సభ ద్వారా పొత్తులో తప్ప ఒంటరిపోటీకి జనసేన సిద్ధంగా లేదని మరోసారి స్పష్టంగా చెప్పేశారు. ఒంటరిగా పోటీచేస్తే జనసేనకు రెండోసారి వీరమరణం తప్పదని ఆమధ్య రణస్ధలం బహిరంగసభలోనే పవన్ చెప్పిన విషయం తెలిసిందే.