జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వంపై విమర్శల డోసు పెంచారు. మాటల కంటే చేతల ద్వారానే వైఎస్సార్సీపీ నేతలకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీలాగా తనకు మీడియా మద్దతు లేకపోవడంతో సోషల్ మీడియాపైనే పవన్ ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకుంటూ జగన్ ప్రభుత్వంపై కార్టూన్ల రూపంలో నిప్పులు చెరుగుతున్నారు.
ఇప్పటివరకు రోడ్ల సమస్యలు, వరదల సమస్యలపై వైఎస్ జగన్ ప్రభుత్వం తీరును తప్పుబడుతూ సోషల్ మీడియాలో సెటైరికల్ కార్టూన్లు పోస్టు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.. జనసేనాని. ఇప్పుడు అనకాపల్లి ఎమ్మెల్యే, జగన్ ప్రభుత్వంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కు పవన్ కల్యాణ్ గట్టి గునపం దింపారని అంటున్నారు.
తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాము మద్యపాన నిషేధం చేస్తామని అనలేదని.. కావాలంటే తమ మేనిఫెస్టోలో పెట్టినట్టు చూపాలని గుడివాడ్ అమర్నాథ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
కేవలం తాము మద్యం రేట్లను స్టార్ హోటళ్ల స్థాయిలో పెడతామని మాత్రమే చెప్పామని గుడివాడ అమర్నాథ్ నాలుక మడతేసిన సంగతి తెలిసిందే. అమర్నాథ్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలోనూ నెటిజన్లు అమర్నాథ్ ను ఆడుకున్నారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను పోస్టు చేసి.. అందులో మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన అంశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అమర్నాథ్ అడ్డంగా బుక్కయ్యారు. మరోవైపు వైఎస్సార్సీపీ అధిష్టానం నుంచి కూడా అమర్నాథ్ కు ఫుల్లుగా క్లాసు పడ్డట్టు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అమర్నాథ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా సోషల్ మీడియలో ఒక సెటైరికల్ కార్టూన్ ను పోస్టు చేశారు. ‘మద్యం మిథ్య.. నిషేధం మిథ్య.. తాగమని, తాగొద్దని అనడానికి మనమెవరం.. అంతా వాడి ఇష్టం’ అనే క్యాప్షన్‌తో సెటైరికల్ కార్టూన్‌ని పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు. దీంతో ఈ కార్టూన్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. పవన్ అభిమానులు, నెటిజన్లు, జనసేన పార్టీ శ్రేణులు దీన్ని లైకులు, కామెంట్లు, షేర్లతో హోరెత్తిస్తున్నారు.