ఆన్ లైన్ బెట్టింగ్ డబ్బుల ట్రాన్స్ ఫర్.. పేటీఎం వివరణ

Update: 2020-08-20 16:30 GMT
ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ తో ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేసిన చైనా కంపెనీల వ్యవహారంలో పేటీఎం ద్వారా ట్రాన్స్ ఫర్లు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పేటీఎం ప్రతినిధులు వచ్చి వివరణ ఇచ్చారు. పేటీఎంలకు వివిధ గేట్ వేల ద్వారా డబ్బు పంపిస్తే వాటిని రెండు మూడు రోజులకు ఒకసారి హెచ్ఎస్బీసీ ఖాతాలకు పంపించాలనే ఒప్పందం చేసుకున్నట్టు పేటీఎం అధికారులు వివరణ ఇచ్చారని సమాచారం. తాము వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని.. అలాగే చైనీస్ సంస్థలతోనూ ఒప్పందాలు జరిగాయన్నారు.

తాజాగా 1107 కోట్లు బెట్టింగ్ రూపంలో వసూలు చేయగా.. 110కోట్లు చైనాకు తరలిపోయాయని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఒక చైనీయుడు, ముగ్గురు భారతీయులను ఈనెల 13న సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో హవాలా ద్వారా ఈ డబ్బు ఇతర దేశాల మీదుగా చైనాకు తరలిపోయినట్టు పోలీసులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం.

ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు పేటీఎం నుంచి జరగడంతో పేటీఎంకు నోటీసులు జారీ చేసి.. ఆయా కంపెనీలతో ఉన్న ఒప్పందాలపై సైబర్ క్రైమ్ పోలీసులు వివరణ కోరారు.
Tags:    

Similar News