చార్జీల విష‌యంలో పేటీఎం యూ ట‌ర్న్‌

Update: 2017-03-10 09:44 GMT
చార్జీల భారం విష‌యంలో 24 గంట‌ల్లోనే పేటీఎం యూట‌ర్న్ తీసుకుంది. క్రెడిట్ కార్డు ద్వారా వాలెట్ రీచార్జ్ చేసుకుంటే 2 శాతం చార్జీ వ‌సూలు చేయాల‌న్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంది. క‌స్ట‌మ‌ర్ల సౌక‌ర్యం కోసం తాము ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేటీఎం త‌న బ్లాగ్‌ లో వెల్ల‌డించింది. క్రెడిట్ కార్డ్ రీచార్జ్‌ పై 2 శాతం చార్జీ నిర్ణ‌యం చాలా మంది యూజ‌ర్ల‌కు అసౌక‌ర్యం క‌లిగించింద‌ని మాకు తెలిసింది. క్రెడిట్ కార్డును స‌రైన అవ‌స‌రాల‌కు వాడుకుంటున్న‌వారు కూడా దీని వ‌ల్ల చాలా ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆ బ్లాగ్‌ లో పేటీఎం స్ప‌ష్టంచేసింది.

పేటీఎం దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకే క్రెడిట్ కార్డ్ రీచార్జ్‌ పై చార్జీ వ‌సూలు చేస్తున్న‌ట్లు ఇంత‌కుముందు పేటీఎం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. చాలా మంది యూజ‌ర్లు క్రెడిట్ కార్డు ద్వారా వాలెట్‌ ను రీచార్జ్ చేసుకొని వాటిని బ్యాంకుకు ట్రాన్స్‌ ఫ‌ర్ చేసుకోవ‌డం వ‌ల్ల తాము న‌ష్ట‌పోతున్నామ‌ని ఆ సంస్థ చెప్పింది. అయితే ఇలాంటి దుర్వినియోగాల‌ను అడ్డుకోవ‌డానికి ఇత‌ర మార్గాల‌పై దృష్టిసారిస్తున్న‌ట్లు పేటీఎం తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News