చార్జీల బారం మోపుతూ వినియోగదారుల నడ్డి విరిచేందుకు సిద్ధమైన ప్రభుత్వ - ప్రైవేటు బ్యాంకుల బాటలనే నడిచేందుకు పేటీఎం డిసైడయింది. ఏకంగా రెండు శాతం చార్జీ మోపనున్నట్లు ప్రకటించింది. క‌్రెడిట్ కార్డు ద్వారా పేటీఎం వాలెట్ లో డబ్బు వేసుకుంటే ఇక నుంచి 2 శాతం చార్జీ వసూలు చేయాలని పేటీఎం నిర్ణయించింది. మార్చి 8 నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. పేటీఎంను దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేటీఎం తమ అధికారిక బ్లాగ్ లో వెల్లడించింది. దీని వెనక ఆసక్తికరమైన కారణం ఉందని కూడా పేటీఎం తెలిపింది. చాలా మంది యూజర్లు సింపుల్ గా క్రెడిట్ కార్డు ద్వారా రీచార్జ్ చేసుకొని, దానిని బ్యాంకులకు ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్నారని పేటీఎం తెలిపింది. అందుకే ఈ నిబంధన తెచ్చినట్లు వివరించింది.
మీరు దేని ద్వారా పేమెంట్ చేసినా.. అందుకు తగిన ఫీజును కార్డ్ నెట్ వర్క్స్ లేదా బ్యాంకులకు పేటీఎం చెల్లిస్తుంది. క్రెడిట్ కార్డులు వాడినపుడు పేటీఎం చాలా ఎక్కువ మొత్తంలో చార్జీలను సదరు కార్డు నెట్ వర్క్స్ - బ్యాంకులకు చెల్లిస్తోంది. యూజర్లు మనీ యాడ్ చేసుకొని దానిని బ్యాంకు ట్రాన్స్ ఫర్ చేసుకుంటుంటే.. మేము నష్టపోతున్నాం
అని బ్లాగ్ లో పేటీఎం చెప్పింది. అందుకే చార్జీలు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.ఈ పన్నుల భారం పోస్ట్‌ను పేటీఎం సీఈవో శేఖర్ శర్మ షేర్ చేశారు.
అయితే షాపింగ్ - లేదా బిల్స్‌ను క్రెడిట్ కార్డ్ ద్వారా కడితే ఎలాంటి చార్జీలు ఉండవని, కేవలం వాలెట్ రీచార్జ్ కే ఇది వర్తిస్తుందని పేటీఎం స్పష్టంచేసింది. అంతేకాదు క్రెడిట్ కార్డు తప్ప మిగతా ఏ ఆప్షన్ ద్వారానైనా వాలెట్ రీచార్జ్ చేసుకున్నా.. ఉచితమేనని తెలిపింది. అయితే వాలెట్‌లో క్రెడిట్ కార్డు ద్వారా యాడ్ చేసుకున్న డబ్బును ఇతర పేమెంట్స్ కు వాడుకుంటే ఆ చార్జీకి సమానమైన మొత్తాన్ని క్యాష్ బ్యాక్ ద్వారా పేటీఎం చెల్లించనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/