ఏపీలో పెగాసస్ కొండను తవ్వేందుకు వైసీపీ సైన్యం బయలు దేరింది. అసెంబ్లీ స్పీకర్ నియమించిన హౌస్ కమిటీ.. సభ్యులు రేపో మాపో..పని ప్రారంభిస్తారట. ఓకే.. మంచిదే. అయితే.. ఇక్కడ సామాన్యుల నుంచి మేధావుల వరకు కూడా కొన్ని మౌలిక.. ముఖ్యమైన ప్రశ్నలు తెరమీదికివస్తున్నాయి.
వాటికి ముం దు సమాధానం చెబుతారా? అనేది చూడాలి. ఎందుకంటే.. పెగాసస్‌పై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఒక రోజు మొత్తం.. దీనిపై చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో దీనిని కొనలేదన్నారు.
అంతేకాదు.. ప్రైవేటుగా చంద్రబాబు వర్గీయులు కొని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే.. దీనికి కూడా ఆధారాలు లేవని తెగేసి చెప్పారు. ఇక, ఇతర మంత్రులు కూడా మాట్లాడుతూ.. ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక, పెగాసస్ కంపెనీ.. తన వెబ్ సైట్‌లో పేర్కొన్న విషయాన్ని మీడియా బయటపెట్టింది.
తాము ప్రభుత్వాలకు తప్ప.. ఇతరులకు ఈ స్పైవేర్‌ను విక్రయించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. మరి ఇంతగా ప్రభుత్వమే చెబుతున్నప్పుడు.. ఈ స్పైవేర్ పై ప్రస్తుతం వేసిన సభాసంఘం ఏం తేలుస్తుంది? అనేది ప్రశ్న.
పోనీ.. మాజీ సీఎం చంద్రబాబు ను కానీ, అధికారులను కానీ.. విచారించే హక్కు ఈ సంఘానికి ఉంటుందా? ఉంటే మాత్రం అసలు లేదని ప్రభుత్వమే చెబుతున్నప్పుడు.. ఏం చేస్తుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎలా చూసుకున్నా.. ప్రస్తతం వేసిన సభా సంఘం ఏమీ తేల్చే ప్రసక్తి లేదని.. స్పష్టంగా తెలుస్తోంది.
కేవలం తాము ఏదో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేశాం.. అనే దోరణిలో వ్యవహరించడమే తప్ప.. ఇందులో ఒరిగేదీ ఏమీ కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. కేవలం ప్రజాధనం వృధా తప్ప.. అంటే.. కమిటీకి 20 లక్షలరూపాయలు ఇవ్వాలని..ఖర్చు ల కోసం.. స్పీకర్ ఆదేశించారు. ఇది తప్ప.. ఇంతకు మించి ఒరిగేది ఏమీ ఉండదని చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.