వ‌రాల వ‌ర్షం కురిపిస్తోన్న జ‌గ‌న్‌

Update: 2017-12-03 04:21 GMT
జ‌గ‌న్ పాద‌యాత్ర నిరాటంకంగా సాగిపోతోంది. 24వ రోజు పాద‌యాత్ర సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకున్నాయి. కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేసిన జ‌గ‌న్ కార‌ణంగా.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా తెలుగు త‌మ్ముళ్ల గుండెలు అదిరే మాట‌ల్ని చెప్పారు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. పాద‌యాత్ర సంద‌ర్భంగా వృద్ధ దంపతుల మాట‌లు విన్న జ‌గ‌న్‌.. వారి క‌ష్టానికి క‌దిలిపోయారు. వెంట‌నే ఆయ‌న నోట భారీ హామీ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో సాగిన ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో తుగ్గ‌లి మండ‌లం రాత‌న గ్రామానికి చెందిన వెంక‌ట‌ప్ప‌.. వ‌ర‌ల‌క్ష్మి దంప‌తులు జ‌గ‌న్‌ను క‌లిశారు. త‌మ ఆవేద‌న‌ను జ‌గ‌న్ తో పంచుకున్నారు. త‌న కుమారుడు రాజేశ్ మాన‌సిక విక‌లాంగుడ‌ని.. వంద శాతం వైక‌ల్య‌మున్నా పింఛ‌న్ ఇవ్వ‌టం లేద‌ని వాపోయారు. వారు త‌మ గోడు చెప్పుకుంటున్న వేళ‌.. గ్రామానికి చెందిన మ‌రికొంద‌రు దివ్యాంగులు త‌మ వెత‌ల్ని చెప్పుకొచ్చారు.

త‌న‌కు అన్ని అర్హ‌త‌లు ఉన్నా విక‌లాంగ పింఛ‌న్ ఇవ్వ‌టం లేద‌ని ప‌లువురు ఆరోపించారు. దీనికి స్పందించిన జ‌గ‌న్ కీల‌క హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే దివ్యాంగుల‌కు రూ.3వేల చొప్పున ప్ర‌తి నెలా పింఛ‌న్ ఇస్తాన‌న్నారు. అంతేకాదు.. వృద్ధాప్య పింఛ‌న్ల‌ను ప్ర‌తి కుటుంబంలోని ఇద్ద‌రికి ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు.

కాస్త ఓపిక ప‌ట్టాల‌ని త్వ‌ర‌లోనే త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.  ప‌లువురు వృద్ధులు.. దివ్యాంగులు త‌మ స‌మ‌స్య‌ల్ని జ‌గ‌న్ కు ఏక‌రువు పెట్టుకున్నారు. రాత‌న గ్రామం దాటిన జ‌గ‌న్ ను పత్తి రైతులు క‌లిశారు. త‌మ‌కున్న స‌మ‌స్య‌ల్ని చెప్పుకున్నారు.

మ‌హిళారైతులు శ్రీదేవి.. సుంక‌మ్మలు జ‌గ‌న్ కు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటూ ఐదు ఎక‌రాల్లో ప‌త్తి వేశామ‌ని.. పెట్టుబ‌డికి రూ.2ల‌క్ష‌లు ఖ‌ర్చు అయిన‌ట్లు పేర్కొన్నారు.ప‌త్తికి వైర‌స్ సోకి దిగుబ‌డి త‌గ్గిపోయింద‌ని.. ఎక‌రాకు రెండు మూడు క్వింటాళ్ల దిగుబ‌డి కూడా రావ‌టం లేద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌ల్ని క‌ల్పించ‌టంలో బాబు స‌ర్కారు ఘోరంగా విప‌ల‌మైంద‌ని విరుచుకుప‌డ్డారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినంత‌నే రైతుల స‌మ‌స్య‌లు తీరేలా నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని చెప్పారు. 24వ రోజు పాద‌యాత్ర‌లో కీల‌క‌మైన హామీలుగా.. వృద్ధాప్య పింఛ‌న్లు ఒకే ఇంట్లో ఉన్న ఇద్ద‌రు వృద్ధుల‌కు ఇవ్వ‌టంతో పాటు.. దివ్యాంగుల‌కు నెల‌కు రూ.3 వేలు చొప్పున పింఛ‌న్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించ‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు బేజారెత్తే హామీగా అభివ‌ర్ణిస్తున్నారు. 
Tags:    

Similar News