చెప్పే మాటలకు.. జరిగే చేతలకు మధ్య అంతరం ఎంత ఎక్కువగా ఉందన్న విషయం బుధవారం చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. హైదరాబాద్ మహానగరంలోని హాస్టల్స్ యజమానులు కొందరు.. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో.. హాస్టల్స్ లో ఉన్న వారిని ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా కోరినట్లుగా చెబుతూ.. పలువురు పోలీసు స్టేషన్లను ఆశ్రయించారు. ఇలాంటి విషయాల్ని వెంటనే కలుగుజేసుకొని సెట్ చేయాల్సిన పోలీసులు.. జీహెచ్ఎంసీ యంత్రాంగం అందుకు భిన్నంగా వ్యవహరించింది.
హాస్టల్స్ మూసివేస్తున్నారు కాబట్టి.. తాము ఎక్కడ ఉండాలన్న ప్రశ్నను సంధిస్తున్న యువతీయువకుల వాదనకు ఓకే చెప్పేసి.. వారు ప్రయాణించేందుకు వీలుగా అనుమతి పత్రాల్ని జారీ చేశారు. ఈ విషయం తెలిసిన వేలాది మంది రోడ్ల మీదకు వచ్చేసి.. తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ల ముందు జమ అయ్యారు. కరోనా వేళ.. ఒక్కరంటే ఒక్కరు కూడా అనవసరంగా రోడ్ల మీదకు రాకూడదన్న ప్రాథమిక విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.
అర్జెంట్ గా ఊరికి వెళ్లిపోవటమే లక్ష్యంగా వ్యవహరించిన వైనంతో పోలీస్ స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసులు జారీ చేసిన అనుమతిపత్రాల్ని తీసుకొని ఇలాంటి వారంతా ప్రైవేటు వాహనాలు.. సొంతవాహనాల్ని తీసుకొని ఏపీ బోర్డర్ల వైపు వెళ్లిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో మిస్ అయిన ప్రధానమైన పాయింట్.. తెలంగాణ పోలీసు ముద్రతో ఇచ్చిన అనుమతి పత్రాన్ని ఏపీ పోలీసులు ఎందుకు ఓకే చెబుతారని?
రెండురాష్ట్ర ప్రభుత్వాలు ఒకరికొకరు ముందుస్తుగా మాట్లాడుకొన్నాక ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఫర్లేదు. అందుకు భిన్నంగా.. తెలంగాణ ప్రభుత్వం.. పోలీసులు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ సరిహద్దులకు వేలాదిగా చేరుకున్నారు. వీరిని ఏపీ బోర్డర్ లోకి అనుమతించేందుకు అక్కడి వారు ససేమిరా అనటంతో.. చివరకు బుధవారం లేట్ నైట్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకొన్నాక కానీ.. తెలంగాణ నుంచి బయలుదేరిన ఏపీ ప్రాంత వాసుల్ని ఏపీలోకి అనుమతించాలని నిర్ణయించారు. అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్ ఏమంటే.. తెలంగాణ పోలీసులు వేసిన ముద్రను.. ఏపీ పోలీసులు అనుమతించరు కదా? ఇంత చిన్న విషయాన్ని వదిలేసి.. వేలాది మందిని ఏపీకి పంపించటానికి మించిన తప్పు ఇంకేం ఉంటుందన్నది ప్రశ్న?