వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పవన్ చేసిన ప్రసంగం అంతా కూడా సెల్ఫ్‌డబ్బా మాదిరిగా ఉందన్నారు. ``ఏరా, ఒరే అనడమేనా నీ సంస్కారం?`` అని ప్రశ్నించారు. ``దిగజారుడు స్వభావం గల వ్యక్తి పవన్. పవన్.. ఇదేనా నీ వ్యక్తిత్వం?`` అని మండిపడ్డారు.
పవన్ ప్రసంగం అంతా కూడా ఆత్మస్తుతి, పరనిందగా ఉందన్నారు. సినిమా డైలాగ్స్‌కే పవన్ ప్రసంగం సరిపోయిందని దుయ్యబట్టారు. సభకువచ్చిన జనాన్ని నమ్మను అని చెప్పడమే దౌర్భాగ్యమని, మీరు నాకు నమ్మకం ఇవ్వగలరా అని జనాన్నే ప్రశ్నిస్తున్నాడని పేర్ని వ్యాఖ్యానించారు. పవన్ సీఎం జగన్ మూడు ముక్కల ముఖ్య మంత్రి అని వ్యాఖ్యానించడంపైనా పేర్ని మండి పడ్డారు.
పవన్ మూడు ముక్కల రాజకీయ నాయకుడని అన్నారు. ``పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి. ఓ వైపు బీజేపీతో మరోవైపు టీడీపీతో రాజకీయం. గతంలో చంద్రబాబు, నువ్వు కలిసి ఎన్ని ఉద్యోగాలిచ్చారు?. 2014లో నిరుద్యోగం కనిపించలేదా?`` అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుకు, నీకు వచ్చినవి దిక్కుమాలిన రాజకీయాలే అని దుయ్యబట్టారు. ``కాపులను మోసం చేశావు.. బీసీలను మోసం చేశావు. స్టేజ్ మీద బీసీలను ఎందుకు కూర్చోబెట్టలేదు?`` అని పేర్ని ప్రశ్నించారు.
``పవన్ వ్యాఖ్యలు బిల్డప్ బాబాయ్ మాటలతో సమానం. మాది నియంత ప్రభుత్వం అయితే నీ మీటింగ్‌కు పర్మిషన్ వస్తుందా? బాలకృష్ణ సినిమాకు టికెట్ రేట్ పెంచుకునేందుకు పర్మిషన్ వచ్చేదా?`` అని వ్యాఖ్యానించారు.`` సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ కట్టిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు చేసింది పోరాటమా.. ఆరాటమా? మంత్రులు అంబటి, అమర్నాథ్ గురించి మాట్లాడుతారా?`` అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు మత్తులో ఉన్న పవన్‌ను దేవుడు కూడా రక్షించలేడని అన్నారు. ఇవాళ్టితో పవన్ ముసుగు తొలగిపోయిందన్నారు. రాజకీయాల్లో పవన్‌కు వచ్చిన దిక్కుమాలిన ఖర్మ ఇంకెవరికైనా వచ్చిందా? అని పేర్ని అన్నారు.