మంత్రి పేర్ని కౌంట‌ర్‌కు స‌మాధానం ఏదీ?

Update: 2022-01-22 12:30 GMT
ఉద్యోగుల ఆందోళ‌న‌లు.. ప్ర‌భుత్వం స్పందిస్తున్న తీరు.. వంటివి రాష్ట్రంలో చ‌ర్చ‌కు దారితీసిన అంశం తెలిసిందే. దీనిపై అన్ని వ‌ర్గాల్లోనూ.. చ‌ర్చ సాగుతోంది. ఉద్యోగులు త‌మ ఉద్య‌మాల‌ను స‌మ‌ర్ధించుకుం టున్నారు. ప్ర‌బుత్వం తాము ఇచ్చిన పీఆర్సీ క‌రెక్టేన‌ని చెబుతోంది. దీంతో రాష్ట్రంలో అటుస‌ర్కారు.. ఇటు ఉద్యోగుల‌కు మ‌ధ్య పోరు ఎడ‌తెగ‌కుండా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఉద్యోగులు ఒక‌వైపు వ్య‌తిరేకి స్తున్నా. ప్ర‌భుత్వం మాత్రం తాను ప్ర‌క‌టించిన పీఆర్సీని అమ‌లు చేసేందుకు సిద్ధ‌మైంది.

తాజాగా జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో కొత్త పీఆర్సీకి ఓకే చెప్పింది. ఈ క్ర‌మంలో మంత్రి పేర్ని నాని.. మీడియా మీటింగు పెట్టారు. ఉద్యోగులను సీఎం జ‌గ‌న్ త‌న కుటుంబ స‌బ్యులుగా చూస్తున్నార‌ని.. అన్నారు. విధిలేని ప‌రిస్థితిలోనే ఉద్యోగుల‌కు హెచ్చార్ ఏ త‌గ్గింద‌ని.. దీనిని అర్ధం చేసుకోవాల‌ని సూచించారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే త‌న స‌హ‌జ‌సిద్ధ ధోర‌ణిలో.. పేర్ని కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ``ప్ర‌బుత్వంపై బుర‌ద జ‌ల్లుతున్న కొన్ని మీడియా సంస్త‌ల‌ను నేను ఒక‌టే అడుగుతున్నా.. `` అంటూ. పేర్ని రెండు ప్ర‌ధాన మీడియా సంస్థ‌ల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

``మాపై బుర‌ద జ‌ల్లే.. రెండు మీడియా సంస్థ‌ల‌పై.. క‌రోనా ఎఫెక్ట్ ప‌డలేదా?  వారి ఉద్యోగుల‌కు.. జీతాల్లో కోత పెట్ట‌లేదా.. ఇది మ‌న‌కు తెలిసిందే క‌దా..మ‌రి ఆ సంస్థ‌ల్లో ఉద్యోగుల‌కు వేత‌నాలు త‌గ్గించాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. ఆయా మీడియా అధినేత‌లు.. ఆవేద‌న చెంది ఉండ‌రా? ఇప్పుడు జ‌గ‌న్ కూడా అలానే ఆవేద‌న చెందారు`` అని పేర్ని పేర్కొన్నారు. అంటే.. దీనిలో ఒక స‌టైర్‌తో పాటు.. స‌ద‌రు మీడియా అధిప‌తుల‌ను క‌ట్ట‌డి చేసే అంశం కూడా పేర్కొన్నారు.

ఉద్యోగుల‌కు జీతాలు త‌గ్గించ‌డంలో జ‌గ‌న్ ఫీల‌య్యార‌ని.. చెబుతూనే.. దీనిని కూడా వ‌క్ర‌భాష్యం చెబుతార‌ని భావించిన ఆయ‌న‌.. మీడియా అధిప‌తుల‌కే ముడిపెట్టారు. అంటే.. ఆయా సంస్థ‌ల్లో వేత‌నాలు త‌గ్గించాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. వారు బాధ‌ప‌డ‌లేదు.. అని ఎవ‌రు మాత్రం చెబుతారు?  ఇలా.. మొత్తానికి పేర్ని నాని వ్యూహాత్మ వ్యాఖ్య‌ల‌తో మీడియా విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News