ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు కేంద్రమంత్రి సుజనా చౌదరి. తాజాగా ఆయనపై పలు వివాదాస్పద వార్తలు మీడియాలో జోరుగా వస్తున్నాయి. అయితే.. దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఆసక్తికర మాట ఇప్పుడు రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. అధికారపక్ష నేతలపై విపక్షాలు విరుచుకుపడటం కామన్. కానీ.. సుజనా విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
సుజనాకు చంద్రబాబుకు మధ్యనున్న అనుబంధంపై తెలుగుదేశం పార్టీలోనే పలువురికి ఇష్టముండదని.. అలాంటి వర్గ నేతలు ఒకరు ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా టార్గెట్ చేయటంతో సుజనా మీద కొత్త కొత్త ఆరోపణలు మీడియా మీద ప్రముఖంగా వస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. బాబుకు వీర విధేయుడైన ఒక ఎంపీ ప్రత్యేకంగా సుజనా మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా సుజనా వర్గం ఆరోపించటం గమనార్హం.
సదరు ఎంపీ.. సుజనా పరపతిని దెబ్బ తీసేలా కథనాలు మీడియాలో వచ్చేలా చేయటం.. దానిపై చర్చ జరగటం.. మొత్తంగా కేంద్రమంత్రిగా ఉన్న సుజనాను చంద్రబాబు మోయలేని భారంగా మార్చాలన్న కుట్ర జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీలో సుజనాకున్న పలుకుబడిని తగ్గించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయని.. ఇదంతా టీడీపీలోని ఒక వర్గం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే చినబాబుతో సుజనాకు మంచి సంబంధాలు లేవన్న మాట బలంగా వినిపిస్తోంది. సుజనాకు.. చినబాబుకు మధ్య దూరం పెంచటంలో సక్సెస్ అయిన తమ్ముళ్ల వర్గం.. తాజాగా అధినేతకు సైతం అనుమానం కలిగేలా కథనాలు మీడియాలో వచ్చేలా చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. సుజనాకు కేంద్రమంత్రి పదవితోపాటు.. రాజ్యసభ సభ్యత్వ పొడిగింపును బ్రేక్ చేయాలన్నదే సుజనా వ్యతిరేకవర్గం ప్లాన్ గా చెబుతున్నారు. సొంతపార్టీలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సుజనా.. తన ప్రత్యర్థి వర్గంపై పైచేయి ఎలా సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.