చిలుకలు ... చిలక పలుకులు పలుకుతుంది అని అంటారు. కొన్ని చిలుకలు కొన్ని కొన్ని మాటలు మాట్లాడగలవు. కొన్ని సార్లు అవే మాటలు కూడా అనుకోని ఇబ్బందులని తెచ్చిపెట్టగలవు. తాజాగా వాషింగ్టన్ లో ఒక చిలుక దాని ఓనర్ కి లేని పోనీ తంటాలు తెచ్చిపెట్టింది. పొరుగింటి నుంచి హెల్ప్.. హెల్ప్ అరుపులు విన్న ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో పోలీసులు వెంటనే ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. తీరా అక్కడికి వచ్చిన తరువాత అసలు విషయం తెలుసుకుని వెను దిరిగి వెళ్లి పోయారు. అసలు ఆ ఇంట్లో నుండి హెల్ప్ హెల్ప్ అంటూ అరిచింది మహిళ కాదు, ఓ చిలుక అని తెలుసుకున్న తర్వాత నవ్వుకుంటూ వెళ్లి పోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది.
ఈ సంఘటన అమెరికా లోని ఫ్లోరిడా లో ఇటీవల జరిగింది. పూర్తి వివరాలు చూస్తే ... ఓ వ్యక్తి ఇంటి ముందు తన కారును రిపేర్ చేస్తుండగా , అక్కడికి ఒక్క సారిగా పోలీసులు వచ్చారు. ఇంటి నుంచి మహిళ అరుపులు వినిపించాయని ఫిర్యాదు అందిందని తెలిపారు. వారు ప్రశ్నిస్తున్నప్పుడు కూడా ఆ అరుపులు కొనసాగుతున్నాయి. దీంతో సదరు వ్యక్తి అసలు విషయం చెప్పేందుకు ఇంట్లోకి వెళ్లాడు. ఏళ్లు గా పెంచుకుంటున్న చిలుకను తీసుకొచ్చి వారి ముందుంచాడు. ఆ తర్వాత అసలు విషయం పోలీసులకి తెలిపాడు.
ఈ చిలుక పేరు ర్యాంబో. నా చిన్నతనంలో దీన్నో పంజరంలో ఉంచేవారు. అప్పట్లో ఆ చిలుకకి హెల్ప్.నన్ను బయటకు విడిచి పెట్టండి అని పదాలు నేర్పించాను. కొన్నాళ్లకు దాన్ని పంజరం నుంచి విడిచి పెట్టాం. కానీ ఇది మాత్రం ఆ పదాలను మరిచి పోలేదు అని పోలీసులకి తెలిపాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి నుంచి నవ్వుకుంటూ వెను దిరిగి వెళ్లి పోయారు. పోలీసులు రావడం దగ్గర నుంచి వాళ్లు వెళ్లేంత వరకు జరిగిన ఘటనంతా ఆ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఆ వీడియో సోషల్ మీడియా లో షేర్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.