తలసాని ఈసారి కోర్టు మెట్లెక్కాల్సిందేనా..?

Update: 2015-10-29 10:14 GMT
తెలంగాణ మంత్రి తలసానికి  ఆ మంత్రి తలసాని పదవే పెద్ద తలనొప్పిగా మారింది. అయితే... పదవీ వ్యామోహం, ప్రతిష్ఠకు పోయి పదవిని అంటిపెట్టుకుని ఉండడం వల్లే ఆయన విమర్శలకు, ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా తలసాని శ్రీనివాస యాదవ్ కు కోర్టు మెట్లెక్కే పరిస్థితి కనిపిస్తోంది.  ఆయన కు మంత్రి పదవి ఇవ్వడంపై మరొకరు వ్యాజ్యం వేయడమే దీనికి కారణం.

తలసానికి మంత్రి పదవి ఇవ్వడంపై తొలినుంచి వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పలుమార్లు గవర్నరుకు టీడీపీ - కాంగ్రెస్ లు ఫిర్యాదులు చేసినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో మళ్లీ కొందరు కోర్టుకు వెళ్లారు. శివప్రసాదరెడ్డి అనే ఆయన తాజాగా తలసానికి మంత్రి పదవిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.

తలసాని టిడిపి తరపున గెలుపొంది కెసిఆర్ ప్రభుత్వం లో మంత్రి అయ్యారు.ఇది రాజ్యాంగ విరుద్దమని, వేరే పార్టీలో ఉంటూ ప్రభుత్వంలో మంత్రి ఎలా అవుతారన్నది ఆయన ప్రశ్న. ఇప్పటికే తలసాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెబుతున్నారు. అయితే... దానిని స్పీకరు ఎందుకు ఆమోదించడం లేదన్నీ పలు వాదాలకు, వివాదాలకు దారితీస్తోంది. ఈ రాజీనామాలపై హైకోర్టు అది స్పీకర్ పరిధిలోనిదని పేర్కొంది. దాంతో ఈసారి మంత్రి పదవి ఇవ్వడం కరెక్టేనా కాదా అన్నది వ్యాజ్యం అయింది. రాజ్యాంగంలో ఎక్కడా ఫలాన వారికి మంత్రి పదవి ఇవ్వకూడదని ఉందా అన్నది చర్చనీయాంశం.ఈ కేసును హైకోర్టు రెండువారాలు వాయిదా వేసింది.
Tags:    

Similar News