లేటెస్ట్; లండన్ లో ఇప్పుడలా జరుగుతోంది

Update: 2016-06-25 07:45 GMT
యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి బయటకు రావాలా? వద్దా? అన్న ప్రశ్నలకు సమాధానాలు కోరుతూ బ్రిటన్ లో నిర్వహించిన రెఫరెండంలో అత్యధికులు యూరోపియన్ సమాఖ్య నుంచి బయటకు రావాలంటూ ఓట్లు వేస్తూ చారిత్రాత్మక తీర్పు చెప్పటం తెలిసిందే. ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాలన్న తీవ్ర ఒడిదుడుకులు లోను కావటంతో పాటు.. ఇదో సంచలనంగా మారింది. బ్రిటన్ వాసులు తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచంలోని పలుదేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపించటంతో పాటు.. బ్రిటన్ లోని పలువురిని పలు సందేహాల్లోకి దించుతోంది.

బ్రిటన్ లోని మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా.. లండన్ లోని ప్రజలను బ్రెగ్జిట్ భయపెడుతోంది. తాజా తీర్పుతో ఉద్యోగాలు తగ్గిపోతాయాని.. నేరాలు.. ఉగ్రవాదం చెలరేగిపోతుందని.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే.. మరోమారు రెఫరెండంను నిర్వహించాలంటూ అక్కడి వారు డిమాండ్ చేస్తున్నారు.

యూరోపియన్ యూనియన్ లో లండన్ వాసులు కోరుకుంటూ వీధుల్లోకి రావటమే కాదు.. ఆన్ లైన్ పిటీషన్లను భారీగా దాఖలు చేస్తున్నారు. దీంతో హౌస్ ఆఫ్ కామన్స్ వెబ్ సైట్ క్రాష్ కావటం గమనార్హం. ఈ పిటీషన్ మీద సంతకాలు చేస్తున్న వారిలో లండన్ వాసులే అధికంగా ఉన్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున రెండో రిఫరెండం గురించి ఇప్పట్లో ఆలోచన లేదని చెబుతున్నారు. ఏది ఏమైనా రిఫరెండంలో వెలువడిన తీర్పు బ్రిటన్ లోని పలువురిని ఏ మాత్రం సంతోషపెట్టినట్లుగా లేదన్న మాట తాజా పరిణామాలతో స్పష్టమవుతుందని చెప్పొచ్చు.
Tags:    

Similar News