కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా శశిథరూర్?

Update: 2017-03-14 08:00 GMT
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. యూపీలో బీజేపీ తిరుగులేని విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పటికే ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కనీసం జనరల్ వార్డులోకి తెచ్చే దమ్ము రాహుల్ గాంధీకి లేనట్లేనని ఆ పార్టీ సీనియర్లు డిసైడైపోయారట. దీంతో కాంగ్రెస్ లోనే ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారట. కాంగ్రెస్ అనగానే పీతల పార్టీ... ఎవరెటు నడుస్తారో తెలియదు..అందుకే ఎవరికి వారు తామే తురుం ఖాన్ లు అనుకునే పరిస్థితి. అందులో భాగంగానే ఎవరికి వారు తమను తాము ప్రొజెక్టు చేసుకుంటున్నారు. తాజాగా కేరళకు చెందిన వివాదాస్పద కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ పేరు సడెన్ గా తెరపైకి వచ్చింది. థరూర్ ను 2019 ఎన్నికలకు ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలంటూ ఆన్ లైన్లో మద్దతు కూడగడుతున్నారు. దీని వెనుక థరూర్ హ్యాండ్ ఉందని తెలుస్తోంది.
    
థరూర్ ను పీఎం క్యాండిడేట్ గా ప్రకటించాలన్న  ప్రచారాన్ని తిరువనంతపురానికి చెందిన ఒక వ్యక్తి ప్రారంభించారు. శశిథరూర్ అత్యున్నత విద్యార్హతలు కలిగిన వ్యక్తి అని... జాతీయ - అంతర్జాతీయ అంశాల్లో ఆయనకు ఉన్న పరిజ్ఞానం అమోఘమని... ప్రపంచ స్థాయి నాయకులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయని సదరు వ్యక్తి  చెబుతున్నారు.  దేశ ప్రజలలో కూడా శశిథరూర్ కు మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు.
    
థరూర్ ను పీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న ఆయన ఆన్ లైన్ పిటీషన్(మద్దతు కూడగట్టే ప్రతిపాదన పత్రం)కు  6,821 మంది నెటిజన్లు మద్దతు పలికారు. మరి కాంగ్రెస్ దీన్ని ఎంతవరకు స్వీకరిస్తుందో చూడాలి. పైగా భార్య సునంద పుష్కర్ మర్డర్ కేసులో థరూర్ పై ఉన్న నీలినీడలు ఇంకా తొలగకపోవడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించే చాన్సే లేదంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News