ప్రస్తుతం ఓవైపు మూడు రాజధానుల అంశం, మరోవైపు రాజధాని అమరావతి రైతుల పాదయాత్ర ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. వీటికి అనుకూలంగా, వ్యతిరేకంగా మోహరించిన రాజకీయ పక్షాలతో, ఆయా పార్టీల దూషణలు, బూతులతో ఏపీ రాజకీయాలు దేశ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయా పార్టీల నేతల మధ్య కామెంట్ల రూపంలో వార్ నడుస్తోంది.
తాజాగా ఉత్తరాంధ్రలో ఏజెన్సీ కేంద్రమైన నర్సీపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడి మధ్య వార్ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడిపై పెట్ల ఉమాశంకర్ గణేష్ విజయం సాధించారు.
ఎమ్మెల్యే గణేష్ కొద్దిరోజుల క్రితం మూడు రాజధానులకు మద్దతుగా నర్సీపట్నంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. వెనుక వస్తున్న బైక్ అదుపు తప్పిఎమ్మెల్యే వాహనాన్ని ఢీ కొట్టింది.. దీంతో ఎమ్మెల్యే గణేష్ బైక్ పై నుంచి కింద పడిపోయారు. ఆయన కాలుకు తీవ్రంగా దెబ్బ తగలడంతో వెంటనే పైకి లేవలేకపోయారు. దీంతో అనుచరులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన కాలు ఫ్రాక్చర్ అయ్యిందని నిర్ధారించి శస్త్రచికిత్స నిర్వహించారు.
దీనిపై ఎమ్మెల్యే గణేష్ ప్రత్యర్థి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కాళ్లు విరగ్గొడతానని మా ఎమ్మెల్యే అన్నాడు.. అలా అన్న రెండు రోజులకే ఆయన కాలు విరిగింది. అధికారంలో ఉన్నామని విర్రవీగితే ఎవరి పరిస్థితైనా ఇంతే అంటూ అయ్యన్న తీవ్ర విమర్శలు చేశారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ప్రత్యర్థులైనా సరే సానుభూతి చూపడం సహజం. సానుభూతి చూపకపోయినా సైలెంట్ గా ఉంటారు. అయితే అయ్యన్నపాత్రుడు మాత్రం ఇలాంటి పట్టింపు ఏమీ లేకుండా ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు.
అసలే అయ్యన్నపాత్రుడు టీడీపీలో ఫైర్ బ్రాండ్. ఆయన యథాలాపంగా బూతులు తిడతారని గతంలోనే పలు వీడియోలు వెలుగుచూశాయి. మంత్రి రోజా గురించి అసభ్యంగా మాట్లాడిన వీడియోలు హల్చల్ చేశాయి.
ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కూడా రెచ్చిపోయారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు ఆయన కూడా తీవ్రంగా మాటల దాడి చేశారు. నా కాలు విరిగి హాస్పిటల్ లో ఉంటే అలా విరగాల్లే అంటావా శాడిస్టు.. అంటూ ఎమ్మెల్యే గణేష్ రెచ్చిపోయారు. అంతేకాకుండా ఇటీవలే నీ కొడుక్కి చేయి విరిగింది కదా.. మరి దానికేం చెప్తావు అంటూ నిలదీశారు. నేను మూడు నెలల్లో కోలుకుంటా.. నీకు మాత్రం దేవుడు తగిన శాస్తి చేస్తాడు చూడు అంటూ ఎమ్మెల్యే హెచ్చరించారు. నీకు వయసు కూడా అయిపొయింది కదా.. నీకు ఉండే పనిష్మెంట్ అలా, ఇలా ఉండదు చూడు అంటూ ఆస్పత్రిలో బెడ్ మీద నుంచే శాపనార్థాలు పెట్టారు.
అంతేకాకుండా అయ్యన్నపాత్రుడిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు అది వైరల్ అవుతోంది. కాగా ఇద్దరి నేతల కామెంట్లపై నియోజకవర్గ ప్రజల్లో కూడా పెద్ద చర్చే జరుగుతోంది. రాజకీయాలు చివరికి ఇలా భ్రష్టుపట్టిపోయాయంటూ నిట్టూరుస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.