ట్రెండింగ్ : మ్యాన్ అఫ్ ది మ్యాచ్ .. 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్ !

Update: 2021-03-02 07:30 GMT
దేశంలో ధరలు ఒక్కొక్కటిగా కొండెక్కి కూర్చుంటున్నాయి. ఒకప్పటి రోజులతో పోల్చితే ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగాయి .. పెరిగిపోతున్నాయి. మోడీ ప్రభుత్వం దేశ జీడీపీ పెంచుతాం అని ప్రగల్భాలు పలుకుతుంటే నిజంగానే చేస్తుంది అని చాలామంది అనుకున్నారు జీడీపీ సంగతి పెడితే .. గ్యాస్ , డీజిల్ , పెట్రోల్ ధరల్ని మాత్రం బాగా పెంచేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ రేటు సంచరీ దాటేసింది. డీజిల్ కూడా సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లోనూ పెట్రోల్ రేట్లు వంద మార్క్‌ను చేరుకోబోతున్నాయి.

కేవలం మన వాహనాలను నడిపే పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు. మన వంటింటిని నడిపి మన కడుపు నింపే వంట గ్యాస్ రేటు కూడా భగ్గుమంటోంది.  సబ్సిడీ LPG సిలిండర్ల ధరను కూడా చమురు కంపెనీలు భారీగా పెంచుతున్నాయి. అలాగే ఉల్లి నుండి నూనె వరకు అన్ని నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగానే పెరిగిపోయాయి. మాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు ఈ ధరలు భరించడం కష్టంగా మారుతుంది. ముఖ్యంగా కరోనా వల్ల చితికిపోయిన జనాలకు ఇది పెద్ద భారంగా మారింది.

ఈ నేపథ్యంలో ప్రజలు , విపక్షాలు వివిధ రకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జరిగిన ఓ క్రికెట్ టోర్నమెంట్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా పెట్రోల్‌ను బహూకరించారు. 5 లీటర్ల పెట్రోల్ క్యాన్ అందజేసి ఘనంగా సత్కరించారు. భోపాల్ కాంగ్రెస్ నేత మనోజ్ శుక్లా ఈ టోర్నెమెంట్ నిర్వహించారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ ‌లో సలావుద్దీన్ అబ్బాసీ అనే యువకుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ గా నిలిచాడు. అతడికి రూ.5 లీటర్ల పెట్రోల్‌ ను బహుమతిగా ఇచ్చారు. 5 లీటర్ల పెట్రోల్ ధర రూ.510. అక్కడ ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. యువకుడికి పెట్రోల్ క్యాన్‌ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ గా అవార్డుగా బహూకరిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇటీవల ఓ వ్యక్తి పెట్రోల్ బంక్ ముందు బ్యాట్ పట్టుకొని నిల్చున్న ఫొటో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. క్రికెట్ మ్యాచ్‌లో సెంచరీ కొడితే బ్యాట్స్‌మెన్ ఎలాగైతే హెల్మెట్ తీసి.. బ్యాటు గాల్లోకి లేపుతారో.. అచ్చం అలాగే పెట్రల్ బంక్ ముందు బ్యాట్ పట్టుకున్నాడు. మొత్తంగా మోడీ ప్రభుత్వం పై సామాన్యుల నుండి విపక్షాల వరకు ప్రతి రోజు ఎదో ఒక విదంగా  నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి మోడీ ప్రభుత్వం ఈ ధరల పెరుగుదల కి ఎప్పుడు కళ్లెం వేస్తుందో మరి.
Tags:    

Similar News